- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
America Citizenship : డెడ్ లైన్ ఫిబ్రవరి 20.. అమెరికా నిర్ణయంతో బెంబేలు
అమెరికాలో నివసిస్తున్న విదేశీయులకు డెడ్ లైన్(Dead Line) తరుముకొస్తుంది. ఫిబ్రవరి 20, 2025 గడువు సమీపిస్తున్న కొద్ది వారు బెంబేలెత్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : అమెరికాలో నివసిస్తున్న విదేశీయులకు డెడ్ లైన్(Dead Line) తరుముకొస్తుంది. ఫిబ్రవరి 20, 2025 గడువు సమీపిస్తున్న కొద్ది వారు బెంబేలెత్తున్నారు. అమెరికా అధ్యక్ష(America President) బాధ్యతలు చేపట్టిన డోనాల్డ్ ట్రంప్(Donald Trump) పలు సంచలన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. వాటిలో ముఖ్యమైనది 'అమెరికా పౌరసత్వం'(American Citizenship) కూడా ఒకటి. దీని ప్రకారం అమెరికాలో గ్రీన్ కార్డ్(Green Card) లేదా పౌరసత్వం ఉంటేనే అక్కడ పుట్టే పిల్లలకు ఆటోమేటిక్ గా అమెరికన్ సిటిజన్షిప్ లభిస్తుంది. ఈ ఉత్తర్వులు ఫిబ్రవరి 20 నుంచి అమల్లోకి రానున్నాయి. గ్రీన్ కార్డు గాని, పౌరసత్వం లేనివారు ఈ గడువు లోపు అమెరికాలో పిల్లలకు జన్మనిస్తేనే వారు సిటిజన్షిప్ కు అర్హులు. ఈ గడువు తర్వాత అక్కడ నివసిస్తున్న H1B, స్టూడెంట్ వీసా, విజిటింగ్ వీసా, గ్రీన్ కార్డు కోసం ఎదురు చూసే వారు అమెరికాలో పిల్లల్ని కంటే వారికి ఆటోమేటిక్ గా పౌరసత్వం రాదు. ఇంతకముందు అనేక మంది విదేశీయులు వారి పిల్లలకు అమెరికా పౌరసత్వం కోసం కేవలం డెలివరీకి కొన్ని వారాల ముందు మాత్రమే అమెరికాలో ఉండి, అక్కడ పిల్లలకు జన్మనిచ్చేవారు. ఇకపై అలాంటి వారికి పౌరసత్వం వర్తించదు.






