Donald Trump: ట్రంప్‌ మాములోడు కాదు.. ముసలోడే కదా అనుకుంటే బీస్ట్‌ కారును ఎలా నడిపారో చూడండి!

by Vennela |

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్(Donald Trump) ట్రంప్ గురించి ప్రత్యేకించీ చెప్పాల్సిన అవసరం లేదు.

Donald Trump: ట్రంప్‌ మాములోడు కాదు.. ముసలోడే కదా అనుకుంటే బీస్ట్‌ కారును ఎలా నడిపారో చూడండి!
X

దిశ, వెబ్‌డెస్క్: Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్(Donald Trump) ట్రంప్ గురించి ప్రత్యేకించీ చెప్పాల్సిన అవసరం లేదు. జనాలను ఉత్సాహపర్చడంలో ఆయనకు మించిన మాస్ లీడర్ లేరనే చెప్పవచ్చు. తాజాగా జరిగిన అలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది. తన సొంత రాష్ట్రమైన ఫ్లోరిడాలో ప్రతిష్టాత్మకంగా మొదలైన ది డెటోన 500 మోటార్ రేసు ప్రారంభానికి ఏకంగా అధ్యక్షుడు మోటార్ కేడ్ లో వాడే తన కారు ది బీస్ట్(The Beast) ను కూడా పంపారు. అది ప్రేక్షకులను ఉత్సాహపరుస్తూ రెండు ల్యాప్స్ ను కూడా పూర్తి చేసింది.

ఆ సమయంలో ట్రంప్ తన మనవరాలు కరోలినాతో కలిసి అందులో ఉన్నట్లు శ్వేతసౌధం విడుదల చేసిన ఓ వీడియోను బట్టి తెలుస్తోంది. అంతేకాదు అధ్యక్షుడి విమానం ఎయిర్ ఫోర్స్ వన్ కూడా ది డెటోన(The Daytona) 500 మైదానం చుట్టూ ఓ రౌండ్ కూడా వేసింది. ఈ సందర్భంగా ట్రంప్(Donald Trump) తన సందేశంలో దిడెటోన (The Daytona) 500 రేసు అంటే జీవితంలో వేగం అంటే మక్కువ, అడ్రెనలిన్ ఉప్పొంగించే దూకుడు, రేసింగ్ లోని థ్రిల్ ను ప్రేమించేవారిని ఒక్క చోటుకు తీసుకువచ్చింది. రేసింగ్ ట్రాక్(Racing track) పై ఇంజిన్ల గర్జన, స్టాండ్లతో ఎగిరే పతకాలు, వేగం, శక్తి, దిమేర్ అమెరికా గ్రేట్ అగైన్ కు ఈ రేసు ఇచ్చే గౌరవం అంటూ పేర్కొన్నారు.


ట్రంప్ వెస్ట్ పామ్ బీచ్ నుంచి ఈ రేసుకు వచ్చారు. ఈ క్రమంలోనే ఆయన ప్రయాణిస్తున్న ఎయిర్ ఫోర్స్ వన్ రేట్ ట్రాక్(Air Force One Rate Track) చుట్టూ ఓ ప్రదక్షిణ చేసి ప్రేక్షకులను ఉత్సాహపరిచింది. ఆయనతోపాటు కుమారుడు ఎరిక్, మనవడు లూకె, రవాణ మంత్రి సియాన్ డఫ్టీ, ఇంటీరియర్ సెక్రటరీ డౌగ్ బూర్గమ్ వంటి వాళ్లున్నారు. దీంతోపాటు పలువురు కాంగ్రెస్ సభ్యులు కూడా ట్రంప్ తోపాటు ప్రయాణించారు. ఆ తర్వాత అధ్యక్షుడి కార్ల కాన్వాయ్ రేస్ ట్రాక్ పై రెండు ల్యాప్ లను కంప్లీట్ చేసింది.

Next Story