ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామాపై కేజ్రీవాల్ రియాక్షన్

by Prasad Jukanti |

కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయడంపై పలువురు నేతలు స్పందిస్తున్నారు.

ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామాపై కేజ్రీవాల్ రియాక్షన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: నీట్ (NEET) ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో దేశవ్యాప్తంగా నిరసనలు తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ శనివారం తన పదవికి రాజీనామా సమర్పించిన సంగతి తెలిసిందే. ఈ పరిణామంపై అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేసినందుకు దేశ ప్రజలందరికీ నా అభినందనలు. ఇది ప్రజాస్వామ్యానికి దక్కిన పెద్ద విజయం అని తెలిపారు. ఈమేరకు ఇవాళ ఓ వీడియోను ఆయన విడుదల చేశారు. నిరసన సమయంలో విద్యార్థులు కొనసాగించిన కృషిని ప్రశంసించిన కేజ్రీవార్ యువతకు, జెన్ జీని అభినందనలు తెలిపారు. ఇంత పెద్ద ఆందోళన తర్వాత ప్రజల ఉద్యమంతో ప్రభుత్వం అహంకారం బద్ధలైందని ఇది ప్రజాస్వామ్యానికి పెద్ద విజయం అన్నారు. ఇకపైనా ప్రభుత్వం ప్రజల మాటలను వినడం అలవాటు చేసుకోవాలన్నారు.

Next Story