- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత్ బియ్యంపై ట్రంప్ కన్ను.. అదనపు సుంకాలు విధించే చాన్స్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరో బాంబు పేల్చబోతున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరో బాంబు పేల్చబోతున్నారు. భారత్ నుంచి దిగుమతి అయ్యే బియ్యంపై అదనపు సుంకాలు విధించేందుకు సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. సోమవారం వైట్‌హౌస్ (White House)లో అమెరికన్ రైస్ రైతులతో జరిగిన సమావేశంలో ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 12 బిలియన్ డాలర్ల ఫామర్ ఎయిడ్ ప్యాకేజీ ప్రకటన సందర్భంగా రైతులు ఫిర్యాదు చేశారు. భారత్, థాయ్‌లాండ్ (Thailand), చైనా (China) వంటి దేశాలు భారీ సబ్సిడీలతో బియ్యాన్ని చాలా తక్కువ ధరలకు అమెరికా మార్కెట్‌లో డంప్ చేస్తున్నాయి. మా రైతులు పోటీ పడలేకపోతున్నారని విజ్ఞప్తి చేశారు. అందుకు స్పందించిన ట్రంప్, భారత్ రైస్‌ను ఇలా డంప్ చేయడానికి ఎందుకు అనుమతిస్తున్నామని అధికారులను ప్రశ్నించారు. వాళ్లు మన మార్కెట్‌లోకి వస్తే, మనం కూడా వాళ్ల మార్కెట్‌లోకి వెళ్దామని అన్నారు. అది సాధ్యం కాకపోతే భారత్ బియ్యంపై అదనపు సుంకాలు విధిస్తామని, ఇకపై ఇలాంటి డంపింగ్‌ను అడ్డుకుంటామని స్పష్టం చేశారు.
కాగా, అమెరికాలో భారత బాస్మతి బియ్యానికి గిరాకీ ఎక్కువగా ఉంది. 2024–25లో భారత్ నుంచి అమెరికాకు సుమారు 4.5 లక్షల టన్నుల బాస్మతి బియ్యం ఎగుమతి అయింది. ప్రస్తుతం బాస్మతిపై సున్నా నుంచి 2.4 శాతం వరకు మాత్రమే అమెరికా సుంకం విధిస్తోంది. కానీ నాన్-బాస్మతి రకాలపై ఇతర ఆసియా దేశాలతో పోలిస్తే భారత్ ధరలు చాలా తక్కువగా ఉండటంతో అమెరికన్ రైతులు నష్టపోతున్నారని ప్రధాన ఆరోపణ. అయితే, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి సంబంధించి భారత్–అమెరికా చర్చలు సిద్ధమవుతుండగా ఇలాంటి పరిణామం చోటుచేసుకోవడం ఆసక్తికరంగా మారింది.






