Trump: ఉక్రెయిన్- రష్యా యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా ప్రయత్నాలు

by Shamantha N |

ఉక్రెయిన్‌-రష్యాల మధ్య యుద్ధాన్ని ముగించడం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) రంగంలోకి దిగారు.

Trump: ఉక్రెయిన్- రష్యా యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా ప్రయత్నాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉక్రెయిన్‌-రష్యాల మధ్య యుద్ధాన్ని ముగించడం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) రంగంలోకి దిగారు. దీనిపై సౌదీ అరేబియాలో శాంతి చర్చలు (Ukraine Peace Talks) జరగనున్నట్లు తెలుస్తోది. ఉక్రెయిన్‌లోని అరుదైన భూగర్భ ఖనిజాలు వెలికితీసేందుకు గాను ఆ దేశంతో ట్రంప్‌ 500 బిలియన్‌ డాలర్ల మేరకు డీల్‌ను ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఒప్పందాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తిరస్కరించినట్లు సమాచారం. ఉక్రెయిన్‌లోని అరుదైన ఖనిజాలతోపాటు చమురు, గ్యాస్‌, పోర్టులు, మౌలిక సదుపాయాలు సహా ఆ దేశంలోని సగభాగం సహజ వనరులపై తమకు ఆధిపత్యం ఇవ్వాలని అమెరికా కోరింది.

అమెరికాకే లాభం

కాగా.. అమెరికా ప్రతిపాదించిన డీల్ వల్ల ఉక్రెయిన్‌ ఖనిజ వనరులపై అగ్రరాజ్యానికి 50 శాతం లాభం చేకూరనున్నట్లు బ్రిటన్ మీడియా తెలిపింది. అయితే, అగ్రరాజ్యం అమెరికా, ఉక్రెయిన్‌ నుంచి కోరుతున్న మొత్తం రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ, జపాన్‌లపై విధించిన ఆంక్షల కంటే ఎక్కువని పేర్కొంది. ఈ ఒప్పందం కుదిరితే.. ఉక్రెయిన్‌లో భవిష్యత్ పెట్టుబడి ప్రాజెక్టుల నిబంధనలను నిర్ణయించడంలో అమెరికన్ ఫండ్ నియంత్రణ సాధించే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఏవిధంగా చూసినా, దీనివల్ల ట్రంప్ సర్కారుకే ఎక్కువ మేలు చేకూరే అవకాశం ఉండడంతో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ ఈ డీల్‌ను తిరస్కరించినట్లు వెల్లడించింది. ఇటీవలే ఈ ఒప్పందం గురించి ట్రంప్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌కు తాము 500 బిలియన్‌ డాలర్ల డీల్‌ను ప్రతిపాదించామన్నారు. దానికి జెలెన్ స్కీ అంగీకరించినట్లు తెలిపారు. తమవద్ద అరుదైన ఖనిజ నిల్వలు అధికంగా ఉన్నాయని జెలెన్ స్కీ అన్నారు. వాటివల్ల అమెరికా కంపెనీలకు లాభాలు చేకూరుతాయని తెలిపారు. ఉక్రెయిన్‌లోనూ ఉద్యోగాలు సృష్టించవచ్చని అన్నారు.

Next Story