Trump: త్వరలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ట్రంప్ భేటీ?

by B.Srinivas |

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా ప్రెసిడెంట్ జిన్ పింగ్‌లు త్వరలోనే భేటీ కానున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి.

Trump: త్వరలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ట్రంప్ భేటీ?
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), చైనా ప్రెసిడెంట్ జిన్ పింగ్‌ (Jinping) లు త్వరలోనే భేటీ కానున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది అక్టోబర్ చివరలో దక్షిణ కొరియాలో జరిగే జరిగే ఆసియా-పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ (APEC) వాణిజ్య మంత్రుల సమావేశానికి ఇరువురు నేతలు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా వారి మధ్య ద్వైపాక్షిక సమావేశం జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ట్రంప్ అపెక్ సదస్సుకు వెళ్లనున్నట్టు వైట్ హౌస్ అధికారులు ధ్రువీకరించారు. ట్రంప్ దక్షిణ కొరియా పర్యటనపై చర్చ జరుగుతోందని, ఆర్థిక సహకారంపై దృష్టి సారిస్తామని తెలిపారు. అయితే జిన్‌పింగ్‌తో సమావేశంపై క్లారిటీ ఇవ్వలేదు.

కాగా, ఈ ఏడాది జూన్‌లో ట్రంప్‌తో జరిగిన ఫోన్ కాల్ సందర్భంగా జిన్‌పింగ్ ట్రంప్, ఆయన భార్య మెలానియాను బీజింగ్ సందర్శించాలని ఆహ్వానించారు. దీనికి ట్రంప్ సానుకూలంగా స్పందించినప్పటికీ పర్యటన ఖరారు కాలేదు. కాగా, ఇటీవల జిన్ పింగ్ , మోడీ, పుతిన్‌లు భేటీ కావడంపై ట్రంప్ విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో జిన్ పింగ్, ట్రంప్ భేటీపై ఆసక్తి నెలకొంది.

Next Story