- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Trump: అప్పటి వరకు రష్యాపై ఆంక్షలు, సుంకాలు విధిస్తాం.. పుతిన్‌కు ట్రంప్ వార్నింగ్
రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఇప్పటి వరకు రష్యాకు మద్దతుగా నిలిచిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఇప్పటి వరకు రష్యాకు మద్దతుగా నిలిచిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) యూటర్న్ తీసుకున్నారు. ఇరు పక్షాల మధ్య శాంతి ఒప్పందం కుదిరే వరకు రష్యాపై భారీగా ఆంక్షలు, సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. ఈ విషయాన్ని ఇప్పటికే పరిశీలిస్తున్నామని తెలిపారు. యుద్ధంలో ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ పై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తోందని తెలిపారు. రెండు దేశాలు తక్షణమే చర్చలకు రావాలని కోరారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. ‘రష్యా ప్రస్తుతం ఉక్రెయిన్‌ను దారుణంగా అణచివేస్తోంది. కాబట్టి ఇరు పక్షాల మధ్య కాల్పుల విరమణ, శాంతి ఒప్పందం కుదిరే వరకు రష్యాపై భారీగా ఆంక్షలు, టారిఫ్స్ విధించే విషయాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నా. శాంతి ఒప్పందం జరిగే వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయి. మరింత ఆలస్యం కాకముందే రష్యా ఉక్రెయిన్‌లు చర్చలకు రావాలి’ అని పేర్కొన్నారు. జెలెన్ స్కీతో జరిగిన వాగ్వాదం తర్వాత ఉక్రెయిన్‌కు సైనిక సహాయాన్ని నిలిపివేసిన ట్రంప్ తాజాగా రష్యాపై ఆంక్షలు విధించే విషయాన్ని వెల్లడించడం హాట్ టాపిక్‌గా మారింది.
కాగా, రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అమెరికా కీవ్‌కు అండగా నిలిచింది. ఆర్థిక సాయంతో పాటు ఆయుధాలను అందించింది. అంతేగాక రష్యాపై ఆంక్షలు విధించింది. అయితే యూఎస్ అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉక్రెయిన్‌కు సైనిక సాయాన్ని నిలిపివేశారు. అంతేగాక రష్యాకు మద్దతుగా నిలిచారు. యుద్ధాన్ని ముగించేందుకు చర్యలు తీసుకోవాలని, శాంతి ఒప్పదం చేసుకోవాలని ఇరు దేశాలను కోరారు. ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్‌తోనూ చర్చించారు. ఈ క్రమంలోనే రష్యాకు హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం.






