Trump: అమెరికా, పాక్ చమురు డీల్.. భారత్‌పై టారిఫ్‌ల తర్వాత కీలక పరిణామం

by B.Srinivas |

భారత్‌పై టారిఫ్‌లు విధించిన గంటల వ్యవధిలోనే అమెరికా పాక్‌తో చమురు ఒప్పందం కుదుర్చుకుంది. యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడించారు.

Trump: అమెరికా, పాక్ చమురు డీల్.. భారత్‌పై టారిఫ్‌ల తర్వాత కీలక పరిణామం
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌పై టారిఫ్‌లు విధించిన గంటల వ్యవధిలోనే అమెరికా పాక్‌తో చమురు ఒప్పందం కుదుర్చుకుంది. యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) గురువారం ఈ విషయాన్ని వెల్లడించారు. పాక్‌తో చమురు డీల్ కుదుర్చుకున్నట్టు ప్రకటించారు. దీనిలో భాగంగా యూఎస్, పాక్‌లు సంయుక్తంగా చమురు నిల్వలను అభివృద్ధి చేస్తాయని తెలిపారు. ఈ భాగస్వామ్యానికి నాయకత్వం వహించే చమురు కంపెనీని ఎంపిక చేసే ప్రక్రియ ప్రారంభించామని పేర్కొన్నారు. ఈ డీల్ ద్వారా భవిష్యత్తులో పాకిస్తాన్ భారతదేశానికి చమురు అమ్ముతుందని చెప్పారు.

పాకిస్తాన్ ప్రస్తుతం తన ఇంధన డిమాండ్లను తీర్చడానికి మధ్యప్రాచ్యం నుంచి చమురును దిగుమతి చేసుకుంటోంది. అయితే గతేడాది పాకిస్థాన్‌లో చమురు నిల్వలు గుర్తించారు. ఈ నిల్వలను ఉపయోగించుకోవడానికి పాక్ పెట్టుబడులు ఆకర్షించడానికి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే పాక్ లో డీల్ కుదరడం గమనార్హం. తాజా డీల్‌పై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Shehabaz shareef) స్పందించారు. రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయడంలో నాయకత్వ పాత్ర పోషించిన ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలిపారు. దీనిని చారిత్రక ఒప్పందంగా అభివర్ణించారు.

Next Story