Trump: త్వరలోనే భారత్‌తో ట్రేడ్ డీల్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

by B.Srinivas |

భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయని, త్వరలోనే ట్రేడ్ డీల్ కుదురుతుందని ఆశిస్తున్నట్టు ట్రంప్ అన్నారు

Trump: త్వరలోనే భారత్‌తో ట్రేడ్ డీల్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయని, త్వరలోనే ఇరు దేశాల మధ్య ట్రేడ్ డీల్ కుదురుతుందని ఆశిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అన్నారు. ఇండియాతో వీలైనంత త్వరగా ఒప్పందం ఉంటుందని స్పష్టం చేశారు. తాజాగా ఆయన వైట్ హౌస్ (White House) లో మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోడీ తన అమెరికా పర్యటనలో భాగంగా అగ్రిమెంట్ కుదుర్చుకోవాలని ఆశించారని, ఆ దిశగా చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. సుంకాలపై 90 రోజుల విరామం సమయంలో ఆఫ్రికాను సందర్శించి ఆస్ట్రేలియా (Australia) అధికారులతో చర్చలు జరపాలని కూడా యోచిస్తున్నట్లు చెప్పారు. అంతకుముందు యూఎస్ వాణిజ్య కార్యదర్శి హెవార్డ్ లుట్నిక్ సైతం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ట్రంప్ పరిపాలనా విభాగం భారత్‌లో ట్రేడ్ డీల్ ఖరారు చేసిందని, భారత పార్లమెంటు ఆమోదం కోసం వేచి చూస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలోనే ట్రంప్ ప్రకటన చేయడం గమనార్హం.

మరోవైపు అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ (Scott besent) కూడా అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసిన మొదటి దేశాల్లో భారత్ ఒకటిగా ఉండొచ్చని తెలిపారు. దీంతో రెండు దేశాల మధ్య త్వరలోనే ఒక ఒప్పందం కుదరనుందని పలువురు భావిస్తున్నారు. కాగా, డొనాల్డ్ ట్రంప్ భారత్ పై 26 శాతం ప్రతీకార సుంకాలు విధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దీనిపై 90 రోజుల విరామం ఉంది. ఈ క్రమంలోనే అనేక దేశాలతో యూఎస్ చర్చలు జరుపుతోంది. ఫిబ్రవరిలో భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందం మొదటి దశ పనిని ప్రారంభించడానికి అంగీకరించాయి. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 500 బిలియన్లకు పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి.

Next Story