- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Trump: అమెరికాలో రాడికలిజానికి చోటు లేదు.. కాల్పుల ఘటనపై డొనాల్డ్ ట్రంప్
అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో ఇజ్రాయెల్ ఎంబసీకి చెందిన ఇద్దరు ఉద్యోగులు దారుణ హత్యకు గురయ్యారు.

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా రాజధాని వాషింగ్టన్ (Washington) లో ఇజ్రాయెల్ ఎంబసీ (Israel embassy) కి చెందిన ఇద్దరు ఉద్యోగులు దారుణ హత్యకు గురయ్యారు. యూదు మ్యూజియంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి వెళ్తుండగా నిందితుడు వారిపై కాల్పులకు తెగపడ్డట్టు పోలీసులు తెలిపారు. దీంతో ఉద్యోగులిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అమెరికా ఎఫ్‌బీఐ ఆఫీసుకు సమీపంలోనే ఈ ఘటన జరగడం గమనార్హం. విచారణ చేపట్టిన అధికారులు వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆయనను చికాగోకు చెందిన ఎలియాస్ రోడ్రిగ్జ్‌గా గుర్తించారు. అరెస్ట్ చేసే టైంలో దుండగుడు ఫ్రీ పాలస్తీనా నినాదాలు చేసినట్టు తెలుస్తోంది. కాల్పులకు ముందు మ్యూజియం వెలుపల తిరుగుతూ కనిపించాడని స్థానికులు తెలిపారు. మరణించిన వారిలో ఓ మహిళ, పురుషుడు ఉండగా వీరిద్దరికీ ఇటీవలే ఎంగేజ్‌మెంట్ అయిందని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయ ప్రతినిధి తెలిపారు.
ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) స్పందించారు. యూఎస్‌లో ద్వేషం, తీవ్రవాదానికి స్థానం లేదన్నారు. ‘స్పష్టంగా యూదు వ్యతిరేకత ఆధారంగా జరుగుతున్న ఈ భయంకరమైన హత్యలు వెంటనే ముగియాలి. దేశంలో ద్వేషం, రాడికలిజానికి స్థానం లేదు. బాధితుల కుటుంబాలకు సంతాపం తెలుపుతున్నా. ఈ తరహా ఘటనలు జరగడం బాధాకరం’ అని పేర్కొన్నారు. భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.






