H1B వీసా దరఖాస్తుదారులకు షాకిచ్చిన ట్రంప్.. రుసుము లక్ష డాలర్లకు పెంపు

by Kema Shiva Kumar |   (  Updated:2025-09-20 03:32:17  IST  )

ప్రతీకార సుంకాలతో రెచ్చిపోతున్న ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలకు మరో షాకిచ్చాడు.

H1B వీసా దరఖాస్తుదారులకు షాకిచ్చిన ట్రంప్.. రుసుము లక్ష డాలర్లకు పెంపు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రతీకార సుంకాలతో రెచ్చిపోతున్న ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రపంచ దేశాలకు మరో షాకిచ్చాడు. హెచ్‌-1B వీసాపై ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. హెచ్‌-1B వీసా దరఖాస్తులపై వార్షిక రుసుము లక్ష డాలర్లకు పెంచారు. అందుకు సంబంధించి ఫైల్‌పై ఆయన సంతకం కూడా చేశారు. ఇక మీదట అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు విదేశీ టెక్నికల్ టీమ్‌ను నియమించుకునేందుకు జారీ చేసే ప్రతి వీసాపై ఏడాదికి లక్ష డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. హెచ్-1B‌పై ప్రస్తుతం కొనసాగుతోన్న లాటరీ సిస్టమ్‌ (Lottery System)‌ను కూడా తొలగించారు. అదేవిధంగా ట్రంప్‌ గోల్డ్‌కార్డు పొందాలంటే 10 లక్షల డాలర్లు అమెరికా ప్రభుత్వానికి చెల్లించాలి. అయితే, ట్రంప్ కొత్త హెచ్-1B వీసా విధానం ప్రధానంగా భారతీయుపైనే తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

Next Story