భార‌త్‌లో యాపిల్ కంపెనీలు పెట్టొద్దు..ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

by Ajay Maddhiboyina |

అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ భార‌త్‌కు షాక్ ఇచ్చాడు. భారత్‌లో యాపిల్ కంపెనీలు పెట్టాల్సిన అవసరం లేదని అమెరికాలోనే పెట్టాలని అన్నారు.

భార‌త్‌లో యాపిల్ కంపెనీలు పెట్టొద్దు..ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ భార‌త్‌కు షాక్ ఇచ్చాడు. భారత్‌లో యాపిల్ కంపెనీలు పెట్టాల్సిన అవసరం లేదని అమెరికాలోనే పెట్టాలని అన్నారు. ఖతార్ పర్యటనలో భాగంగా పలు కంపెనీల సీఈవోలతో ట్రంప్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా యాపిల్ సీఈవోతో టిక్ కుక్‌తో మాట్లాడుతూ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారతదేశం తమను తాము చూసుకోగలదని వారు భాగా పనిచేస్తున్నారని వ్యాఖ్యానించాడు.

భారత్ ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధించే దేశాలలో ఒకటి అని అన్నారు. కాబట్టి భారతదేశంలో అమ్మడం చాలా కష్టం అని చెప్పారు. తాను మాట్లాడిన తరవాత అమెరికాలో యాపిల్ తన ఉత్పత్తిని పెంచుతుందని అన్నారు. భారత్ అమెరికా వస్తువులపై ఎలాంటి సుంకాలు విధించమని డీల్ ఆఫర్ చేసిందని తెలిపారు. ఇదిలా ఉంటే యాపిల్ భారత్‌లో మరిన్ని ప్లాంట్లు పెట్టాలనే ఆలోచనలో ఉన్నప్పుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే ఇండియాలో మూడు యాపిల్ ప్లాంట్లు ఉన్నాయి. రెండు తమిళనాడులో ఉండగా ఒకటి కర్నాటకలో ఉంది.

Next Story