Trump: ఖణిజాల ఒప్పందం నుంచి తప్పుకుంటే తీవ్ర పరిణామాలు.. జెలెన్ స్కీకి ట్రంప్ వార్నింగ్

by B.Srinivas |

ఉక్రెయిన్‌కు వెంటనే నాటో సభ్యత్వం ఇవ్వాలని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.

Trump: ఖణిజాల ఒప్పందం నుంచి తప్పుకుంటే తీవ్ర పరిణామాలు.. జెలెన్ స్కీకి ట్రంప్ వార్నింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉక్రెయిన్‌కు వెంటనే నాటో (Nato) సభ్యత్వం ఇవ్వాలని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ (Zelensky) తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. పలు వేదికల పైనా ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఉక్రెయిన్ నాటో సభ్యత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ ఎప్పటికీ నాటోలో సభ్యత్వం పొందలేదని తెలిపారు. అంతేగాక తమతో ఖనిజాల ఒప్పందం నుంచి తప్పుకోవాలని ప్రయత్నిస్తే జెలెన్ స్కీ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. తాజాగా ట్రంప్ వాషింగ్టన్‌లో మీడియాతో మాట్లాడారు. ‘ఖనిజాల ఒప్పందం అనేది అమెరికా, ఉక్రెయిన్ మధ్య ఒక కీలక అగ్రిమెంట్. దీనిపై జెలెన్ స్కీ డీల్ కుదుర్చుకోవాలని అనుకుంటున్నా. కానీ ఆయన ఈ ఒప్పందం నుంచి వెనక్కి తగ్గడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ తప్పుకుంటే భారీ సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని వ్యాఖ్యానించారు.

ఖనిజాల ఒప్పందంపై తిరిగి చర్చలు జరపాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. దీనికి సంబంధించిన ప్రణాళికలను వెంటనే ప్రారంభించాలని సూచించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ (Puthin)తో యూఎస్ సంబంధాలపై అడిగిన ప్రశ్నకు ఆయన స్పందించారు. పుతిన్‌తో తమకు సత్సంబంధాలు ఉన్నాయని తెలిపారు. అలాగే యుద్ధాన్ని ముగించాలని, రష్యా చమురుపై అదనపు సుంకాలను ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాలని కోరారు. కాగా, రష్యా- ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి ట్రంప్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Next Story