- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Trump: భారత్- పాక్ మధ్య యుద్ధం ఆపింది నేను కాదు.. వెనక్కి తగ్గిన ట్రంప్
భారత్-పాక్ మధ్య యుద్ధం ఆపింది నేనేనంటూ ఇన్నాళ్లు ప్రకటిస్తూ వచ్చిన ట్రంప్ వెనక్కి తగ్గారు.

దిశ, డైనమిక్ బ్యూరో: భారత్ -పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని (Indo-Pak War) ఆపింది నేనే అని పదే పదే ప్రకటించుకుంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) ఎట్టకేలకు అసలు విషయాన్ని అంగీకరించారు. ఇరు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపింది నేను కాదని ఈ రెండు దేశాలే తమ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను పరిష్కరించుకున్నాయని చెప్పారు. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ (Munir) కు ట్రంప్ నిన్న విందు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ విందు అనంతరం ఓవల్ ఆఫీస్ లో వీరిద్దరూ మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ భారత్-పాక్ దేశాధినేతలే యుద్ధాన్ని కొనసాగించకూడదని నిర్ణయించుకున్నారు. లేదంటే ఆ పరిస్థితులు అణు యుద్ధానికి దారితీసేవేనన్నారు. అయితే భారత్ పాకిస్థాన్ తో అమెరికా వాణిజ్య ఒప్పందాలపై తాము పని చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా భారత్-పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం విషయంలో క్రెడిట్ అంతా నాదేనంటూ ట్రంప్ పదే పదే ప్రకటనలు చేస్తున్న క్రమంలో నిన్న ట్రంప్ తో ప్రధాని నరేంద్ర మోడీ (Modi) ఫోన్ లో మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఈ ఇద్దరు నేతలు ఫోన్లో మాట్లాడుకోవడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా కాల్పుల విరమణతో అమెరికాకు సంబంధం లేదని ట్రంప్ కు మోడీ స్పష్టంగా తేల్చి చెప్పారు. అయితే మోడీ ఫోన్ తర్వాత కూడా యుద్ధం ఆపింది నేనే అని ప్రకటించిన ట్రంప్ ఆ తర్వాత ఎట్టకేలకు వాస్తవాన్ని అంగీకరించారు. ఈ యుద్ధాన్ని అపింది నేను కాదని ఇండో పాక్ లే పరిష్కరించుకున్నాయని అంగీకరించారు.






