- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత్ మాకు మిత్ర దేశమన్న ట్రంప్.. ఇంట్రెస్టింగ్ రిప్లై ఇచ్చి ప్రధాని మోడీ
రష్యా, చైనా, భారత్‌లపై ప్రతీకార సుంకాలతో రెచ్చిపోతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాస్త వెనక్కి తగ్గాడు.

దిశ, వెబ్‌డెస్క్: రష్యా, చైనా, భారత్‌లపై ప్రతీకార సుంకాలతో రెచ్చిపోతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాస్త వెనక్కి తగ్గాడు. ఈ నేపథ్యంలోనే ఆయన తాజాగా తన సోషల్ మీడియా ‘ట్రూత్’ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా, భారత్ మధ్య వాణిజ్య అడ్డంకులను (US Tariffs) పరిష్కరించడానికి తన స్పెషల్ టీమ్ ఇండియాతో చర్చలు కొనసాగిస్తోందని తెలిపారు. ద్వైపాక్షిక, వాణిజ్య సంబంధాలపై తన మిత్రుడైన భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi)తో మాట్లాడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. భవిష్యత్తు చర్చలు రెండు గొప్పదేశాలకు మంచి ఫలితాలు ఇస్తాయని ఆశిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అయితే, ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా ప్రధాన నరేంద్ర మోడీ రియాక్ట్ అయ్యారు. భారత్, అమెరికా క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పకొచ్చారు. రెండు దేశాల మధ్య ఏర్పడిన వాణిజ్య అడ్డంకులు త్వరలోనే తొలగిపోతాయని.. ఇరు దేశాల సంబంధాలు మరింత బలపడతాయని ఆశిస్తున్నానని కామెంట్ చేశారు. సమస్యను త్వరగా పరిష్కరించేందుకు అమెరికా, భారత్‌లోని ప్రతినిధులు కృషి చేస్తున్నారని తెలిపారు. ఇక తాను కూడా కూడా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌తో మాట్లాడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాని ప్రధాని మోడీ అన్నారు.






