చైనాకు ట్రంప్...జిన్‌పింగ్ తో కీలక స‌మావేశం, 2017 త‌ర్వాత !

by velandi.Saikiran |

ఏప్రిల్‌లో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ను కలుస్తానని ట్రంప్ చెప్పారు.

చైనాకు ట్రంప్...జిన్‌పింగ్ తో కీలక స‌మావేశం, 2017 త‌ర్వాత !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ను త్వరలోనే కలవబోతున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ( Trump) మీడియాకు వివరించారు. ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో చైనా పర్యటనకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వెళ్లబోతున్నారు. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ కూడా ఖరారు అయింది. ఏప్రిల్ మొదటి వారంలో ఈ చైనా పర్యటన ఉండనుంది. 2017 సంవత్సరం తర్వాత తొలిసారిగా చైనాలో పర్యటిస్తున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఈ సందర్భంగా చైనా ( China) అధ్యక్షుడు జిన్ పింగ్ ( Xi Jinping), డోనాల్డ్ ట్రంప్ మధ్య కీలక సమావేశం కూడా జరగనుంది.

చైనాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన

చైనాలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పర్యటించనున్న నేపథ్యంలో... ఇప్పటికే చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో ఫోన్ ద్వారా సుదీర్ఘంగా చర్చలు కూడా జరిగిపోయాయి. ఫిబ్రవరి 4వ తేదీన ఈ ఇద్దరు అగ్ర నేతలు ఫోన్ లో మాట్లాడుకున్నారు. దాదాపు గంటన్నర పాటు ఈ ఇద్దరు సంభాషించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సంభాషణ అనంతరం డోనాల్డ్ ట్రంప్, చైనా పర్యటన ఖరారైంది. ట్రంప్ వెళ్లి వచ్చిన తర్వాత అమెరికాకు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కూడా వస్తాడని తెలుస్తోంది. ఈ మేరకు ట్రంప్ కూడా వెల్లడించారు. ప్రస్తుతానికైతే అమెరికా, చైనా దేశాల మధ్య రిలేషన్ బాగుందని ట్రంప్ వెల్లడించారు. ఇక ఈ అగ్ర రాజ్యాల సంబంధాల కారణంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అనే టెన్షన్ అందరిలోనూ నెలకొంది. ఇక అటు న్యూక్లియర్ ఒప్పందం విషయంలో ఇలాంటి దిగిరాకపోతే , తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇప్పటికే హెచ్చరించారు.

Next Story