- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Trump Tariff: జూలై 9 టారిఫ్ గడువును పొడిగించాలని అనుకోవట్లేదు: ట్రంప్
ఒప్పందాల గురించి చర్చల పురోగతిపై ఆధారపడి గడువు పొడిగించడం లేదంతే ముందుకు జరపడం ఉంటుందన్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో ఒప్పందం చేసుకునేందుకు ఇతర దేశాలకు విధించిన జూలై 9 గడువు పొడిగించాల్సిన అవసరమని స్పష్టం చేశారు. 'గడువు పొడిగించాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను. తాను అనుకుంటే చేయవచ్చు, పెద్ద విషయం కాదు. కానీ, వివిధ దేశాల వాణిజ్య ఒప్పందాల గురించి చర్చల పురోగతిపై ఆధారపడి గడువు పొడిగించడం లేదంతే ముందుకు జరపడం ఉంటుందన్నారు. రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత డొనాల్డ్ ట్రంప్ తమపై అధిక సుంకాలు విధించే దేశాలపై ప్రతీకార సుంకాలు తప్పవని ప్రకటించారు. అందులో భాగంగా అమెరికాకు ఎగుమతి చేసే వివిధ దేశాలపై భారీ టారిఫ్ విధించారు. దీనిపై విమర్శలు, సూచనలు వచ్చిన అనంతరం టారిఫ్ విధించిన దేశాలతో టారిఫ్‌లపై చర్చించడం, వాణిజ్య ఒప్పందం కోసం టారిఫ్ విధించడాన్ని 90 రోజుల పాటు వాయిదా వేశారు. ఆ గడువు జూలై 9తో ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టారిఫ్ అమలు గడువు పొడిగింపుపై స్పష్టత ఇచ్చారు. తాను ఈ టారిఫ్ అంశంపై ఒప్పందాలను తొందరగా ముగించాలనే అనుకుంటున్నానని ట్రంప్ గతవారం ఓ ప్రకటనలో అన్నారు. కాగా, భారత్ వాణిజ్య ఒప్పందం ఖరారు చేసేందుకు సిద్ధంగా ఉన్న దేశాల్లో ఒకటని ట్రంప్ తెలిపారు. భారత వాణిజ్య అధికారుల బృందం గతవారం వాషింగ్టన్ అధికారులతో సమావేశం అయిన సంగతి తెలిసిందే.






