‘ఐదురోజుల్లో డీల్ కుదుర్చుకుంటాం’.. ఇరాన్‌తో చర్చలపై ట్రంప్ మరో ప్రకటన

by Gantepaka Srikanth |

ఇరాన్‌తో చర్చలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

‘ఐదురోజుల్లో డీల్ కుదుర్చుకుంటాం’.. ఇరాన్‌తో చర్చలపై ట్రంప్ మరో ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ఇరాన్‌తో చర్చలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఇరాన్‌తో చర్చలు జరుగుతున్న మాట వాస్తవం. నిన్న కూడా చర్చలు జరిపింది. మాతో డీల్ కోసం ఇరాన్ తహతహలాడుతోంది. ఐదు రోజుల్లో డీల్ కుదిరే అవకాశాలు కన్పిస్తున్నాయి. కానీ ఇరాన్ మీడియా కావాలనే తప్పుడు ప్రచారం చేస్తోంది’ అని అసహనం వ్యక్తం చేశారు.

కాగా, అంతకుముందు ఇరాన్‌పై దాడులకు బ్రేక్ ఇచ్చామని, ఐదు రోజులు దాడులు చేయబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేశారు. అయితే, ఈ ప్రకటనను ఇరాన్ తోసిపుచ్చింది. అసలు ఎలాంటి చర్చలు జరగడం లేదని, ఇదంతా ఆయన ఆడుతున్న డ్రామా అని ఖండించింది. మళ్లీ అదును చూసి దాడులు చేయడానికి జరుగుతున్న కుట్ర అని ఇరాన్ ఓ ప్రకటనలో తెలిపింది. అనంతరం తమ దాడులకు ట్రంప్ భయపడ్డారని, అమెరికా, ఇజ్రాయెల్‌లు చిత్తుగా ఓడిపోయాయని ఇరాన్ ఎద్దేవా చేసింది. అయితే, అమెరికాతో ఎలాంటి చర్చలు జరగడం లేదని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రకటించింది. సమయం చూసి మళ్లీ తమపై దాడులు చేసేందుకే ట్రంప్ ప్లాన్ చేశారని, ఆయన నమ్మబోమని ఇస్లామిక్ రిపబ్లిక్ తేల్చిచెప్పింది. చర్చల విషయంలో ఎవరూ మధ్యవర్తిత్వం వహించడం లేదని, అమెరికాతో ఎలాంటి చర్చలు జరగడం లేదని టెహ్రాన్ స్పష్టం చేసింది ఇదంతా డొనాల్డ్ ట్రంప్ కుట్రని ఆరోపించింది. దీంతో ట్రంప్ మరోసారి స్పందించి వివరణ ఇచ్చారు.

Next Story