- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శత్రువుల్లా ఉంటారనుకుంటే.. ఫ్రెండ్లీగా మమ్దానీ-ట్రంప్ మీట్!
శత్రువుల్లా ఉంటారనుకుంటే ఫ్రెండ్లీగా మమ్దానీ-ట్రంప్ మీట్ జరిగింది. ఇది చూసిన అందరూ ఆశ్చర్యపోయారు.

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను న్యూయార్క్ కొత్త మేయర్ జోహ్రాన్ మమ్దానీ కలిశారు. అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో వీరిద్దరూ ఫ్రెండ్లీగా కనిపించడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. న్యూయార్క్ మేయర్ ఎన్నికల సమయంలో వీరిద్దరూ ఒకరిపై ఒకరు తీవ్రమైన నిందారోపణలు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌ను ‘ఫాసిస్ట్’ అని మమ్దానీ అన్న మాటలను రిపోర్టర్లు లేవనెత్తారు. ఇప్పటికీ అలాగే భావిస్తున్నారా? అని ప్రశ్నించారు. దీనికి మమ్దానీ బదులిచ్చేలోపే ట్రంప్ కలుగజేసుకున్నారు. అతని చేతిపై తడుతూ.. ‘ఏం పర్లేదు. జస్ట్ అవును అని చెప్పేయ్. ఎక్స్‌ప్లెయిన్ చేయడం కన్నా అదే ఈజీ. నేనేం అనుకోను’ అని ట్రంప్ చెప్పారు.
మమ్దానీని రిపబ్లికన్ నేత ఎలీస్ స్టెఫానిక్ ‘జీహాదీ’ అన్న విషయాన్ని కూడా గుర్తుచేసిన రిపోర్టర్లు.. ‘మీరు ఒక జీహాదీ పక్కన ఉన్నారనుకుంటున్నారా?’ అని ట్రంప్‌ను ప్రశ్నించారు. ‘లేదు. నేను ఒక ఆలోచనాపరుడైన వ్యక్తినే కలిశాను’ అని ప్రెసిడెంట్ బదులిచ్చారు. ఇద్దరు నేతలు కూడా వ్యక్తిగత విమర్శల జోలికి వెళ్లకుండా న్యూయార్క్‌లో గ్రాసరీ ధరలు, ఇళ్ల కొరత, మౌలిక వసతుల ధరలు పెరగడం తదితర అంశాలపై చర్చించుకున్నారు. దీనికోసమే తాను ఈ సమావేశం కోరానని మమ్దానీ చెప్పారు. వీళ్లిద్దరు ఎన్నికల సమయంలో ఇవే సమస్యలను పరిష్కరిస్తామంటూ హామీలిచ్చిన సంగతి తెలిసిందే.
ఎన్నికల వేళ మాటల యుద్ధం..
న్యూయార్క్ మేయర్ ఎన్నికల సమయంలో మమ్దానీ వంద శాతం కమ్యూనిస్ట్ లూనటిక్ అని విమర్శించిన ట్రంప్.. అతన్ని పిచ్చివాడని కూడా అన్నారు. అదే సమయంలో డొనాల్డ్ ట్రంప్ ఒక ఫాసిస్ట్ అని, తాను ఆయనకు భయంకరమైన పీడకలగా మారతానని మమ్దానీ ప్రకటించారు. తనపై మమ్దానీ చేసిన విమర్శలను ఏమాత్రం పట్టించుకోని ట్రంప్.. తను అంతకన్నా భయంకరమైన మాటలే విన్నానంటూ జోకులు వేశారు. ఇలా విమర్శలు చేసుకున్న వీరిద్దరూ ఇంత ఫ్రెండ్లీగా కనిపించడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది.






