- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Trump: భారత్ సుంకాలతో మమ్మల్ని చంపుతోంది.. డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
by B.Srinivas |
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇండియాపై విరుచుకుపడ్డాడు. భారత్ సుంకాలు విధించి తమను చంపేస్తుందని వ్యాఖ్యానించారు.

X
దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి ఇండియాపై విరుచుకుపడ్డాడు. భారత్ సుంకాలు విధించి తమను చంపేస్తుందని వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే అత్యంత సుంకాలు విధించే దేశం భారతేనని తెలిపారు. యూఎస్‌పై జీరో టారిఫ్స్ విధించేందుకు భారత్ ముందుకొచ్చిందని స్పష్టం చేశారు. స్కాట్ జెన్నింగ్స్ రేడియో షోలో ట్రంప్ ప్రసంగించారు. ‘చైనా, బ్రెజిల్‌లు సుంకాలతో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి. ఈ తరహాలోనే భారత్ సైతం అమెరికాను టారిఫ్స్‌తో చంపేస్తున్నది. భారత్ ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధించే దేశం. కానీ వారు ఇక యూఎస్ పై ఎటువంటి సుంకాలు విధించబోరు. అమెరికా ఇండియాపై కఠినంగా వ్యవహరించకపోతే ఎప్పటికీ ఇలాంటి ప్రతిపాదన చేసి ఉండేది కాదు. అందుకే సుంకాలు అవసరం. వాటి ద్వారానే ఆర్థికంగా బలంగా మారుతాం’ అని వ్యాఖ్యానించారు.
Next Story






