- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమెరికాలోని భారతీయులకు ట్రంప్ సర్కార్ హెచ్చరిక

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా(America)లో నివాసముంటున్న భారతీయులను ట్రంప్(Donald Trump) సర్కార్ హెచ్చరించింది. అమెరికా చట్టాలు ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు, జరిమానాలు తప్పవని వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు సోషల్ మీడియా(ఎక్స్)లో యూఎస్ రాయబార కార్యాయలం పోస్టు పెట్టింది. అమెరికా పౌరుల రక్షణకు ట్రంప్ యంత్రాంగం కట్టుబడి ఉన్నట్లు పేర్కొంది. కాగా, రష్యాతో భారత్ వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడం మొదలెట్టిన నాటి నుంచి భారత్‌ను ట్రంప్ టార్గెట్ చేశారు. వరుస సుంకాలు విధించడంతో పాటు పదే పదే పరోక్షంగా హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. రష్యా చమురు కొనుగోళ్లను భారత్ కట్టడి చేయకపోతే భారీ సుంకాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రంప్ హెచ్చరించారు. ఈ వివాదం సుంకాల నుంచి అమెరికాలో నివసిస్తున్న భారతీయుల వరకూ వెళ్లింది. తాజాగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించాయి. దీనిపై భారత ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో అని ఆసక్తి నెలకొంది.






