- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థులకు మరో షాకిచ్చిన ట్రంప్.. ఇక అమెరికా కలలు కల్లలేనా!
ఇప్పటికే 50 శాతం టారిఫ్ లు పెంచి భారత్ కు షాకిచ్చిన అమెరికా.. ఇపుడు విద్యార్థులకు షాకిచ్చింది.

దిశ, వెబ్ డెస్క్ : ఇప్పటికే 50 శాతం టారిఫ్ లు పెంచి భారత్ కు షాకిచ్చిన అమెరికా.. ఇపుడు విద్యార్థులకు షాకిచ్చింది. ఇదివరకే వీసా గడువు ముగిసిన వారిని అక్రమ నివాసితులుగా వెనక్కి పంపిన ట్రంప్, ఇపుడు విద్యార్హులకు మరో బ్యాడ్ న్యూస్ ప్రకటించారు. స్టూడెంట్(S), ఎక్సేంజ్(J) వీసాలను ఇకపై కేవలం 4 సంవత్సరాలకు మాత్రమే పరిమితం చేయాలని ప్రతిపాదించారు. ఓపెన్ ఎండెడ్ రూల్ వల్ల ఒకసారి యూఎస్ వచ్చిన వారు అక్కడే ఉండిపోతున్నారని, కొత్త రూల్ వల్ల అలా ఉండటానికి వీలు ఉండదని పేర్కొంది. ఇది అమల్లోకి వస్తే విద్యార్థులకు తీరని నష్టం జరుగుతుంది.
గ్రీన్ ఉన్నవారు మాత్రమే అమెరికాలో ఉండటానికి వీలు ఉంటుంది. అక్కడ చదువులు ముగిసిన వెంటనే క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ రాకపోతే తట్టాబుట్టా సర్దుకొని ఇండియా వచేయాల్సి ఉంటుంది. ట్రంప్ తెస్తున్న ఈ కొత్త వీసాపై విద్యార్థులు గుస్సా అవుతుండగా.., వీసాలు దుర్వినియోగం కాకుండా చూడటానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అడ్మినిస్ట్రేషన్ పేర్కొంది. అలాగే ఇతర దేశాల జర్నలిస్టుల వీసాలు(I) 240 రోజులు, చైనా జర్నలిస్టుల వీసా 90 రోజులకే తగ్గించాలని ప్రపోజ్ చేసింది.
కెనడాలో జరిగిన ఓ ప్రమాదంలో ముగ్గురు మరణానికి కారణమైన ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల.. హెవీ వెహికిల్ డ్రైవర్స్ వీసాలపై కూడా కఠినతరం చేసింది. మొత్తానికి ట్రంప్ పెద్దన్న అమెరికాలో నివసిస్తున్న విదేశీయులకు షాకుల మీద షాకులు ఇస్తున్నాడు.






