- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరోసారి రెచ్చిపోయిన ట్రంప్.. ఇంపోర్టెడ్ ట్రక్కులపై 25 శాతం సుంకాలు
ప్రపంచ దేశాలపై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ (President Donald Trump) ప్రతికార సుంకాల పరంపర కొనసాగుతూనే ఉంది.

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ దేశాలపై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ (President Donald Trump) ప్రతికార సుంకాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇతర దేశాల నుంచి తమ దేశానికి దిగుమతి చేసుకుంటున్న మిడిల్ రేంజ్, హెవీ డ్యూటీ ట్రక్కులపై 25 శాతం సుంకాలను విధిస్తున్నట్లుగా అమెరికా కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం ప్రకటించారు. అయితే, పెంచిన సుంకాలు నవంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని ట్రంప్ తెలిపారు. ఇక అమెరికాకు మిడిల్ రేంజ్, హెవీ డ్యూటీ ట్రక్కులను అధికంగా ఎగుమతి చేసే ఐదు దేశాల్లో మెక్సికో, కెనడా, జపాన్, జర్మనీ, ఫిన్లాండ్‌లు ఉన్నాయి.
కాగా, ఇటీవలే విదేశాల నుంచి అమెరికా (America)కు దిగుమతి చేసుకునే బ్రాండెడ్ డ్రగ్స్, ఫార్మా దిగుమతులపై ఏకంగా 100 శాతం సుంకాలు విధించారు. అక్టోబర్ 1 నుంచే ఆ సుంకాలు ఇప్పటికే అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. అప్‌హోస్టర్డ్ ఫర్నిచర్‌పై 30 శాతం, భారీ ట్రక్కులపై 25 శాతం దిగుమతి సుంకాలను కూడా ట్రంప్ పెంచడం వరల్డ్ వైడ్‌గా హాట్ టాపిక్‌గా మారింది.






