- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Trump : అమెరికాను వీడకపోతే రోజుకు రూ.86 వేల ఫైన్.. ట్రంప్ కీలక ఆదేశాలు
అమెరికాలోని అక్రమ వలసదారులపై ఉక్కు పాదం మోపుతున్న డొనాల్డ్ ట్రంప్ మరో కఠిన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాలోని అక్రమ వలసదారులపై ఉక్కు పాదం మోపుతున్న డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరో కఠిన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తమ ఆదేశాలను పాటించని వలసదారులపై రోజు వారిగా జరిమానాలు విధించడంతో పాటు వారి నుంచి ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని యోచిస్తున్నట్టు సమాచారం. యూఎస్‌ను వీడాలని ఉత్తర్వులు ఉన్నప్పటికీ అమెరికాలోనే ఉన్న వసలదారులకు రోజుకు రూ.86 వేల జరిమానా విధించాలని యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) నుంచి ఆదేశాలు వెలువడినట్టు పలు కథనాలు పేర్కొన్నాయి. కొన్ని సార్లు జరిమానాలు భారీగా విధించే అవకాశం కూడా ఉన్నట్టు వైట్ హౌస్ లోని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు.
అక్రమంగా దేశంలో ఉంటున్న వారు వెంటనే దేశాన్ని వీడకపోతే జరిమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఫైన్ చెల్లించని వారి ఆస్తులను జప్తు చేసే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు తెలిపారు. జరిమానాలు, ఆస్తి జప్తులను సమర్థవంతంగా నిర్వహించడానికి 1,000 మంది కొత్త పారాలీగల్ నిపుణులను నియమించుకోనున్నట్టు సమాచారం. అయితే ఈ జరిమానాలకు ఎప్పటి నుంచి అమలు చేస్తారనే దానిపై స్పష్టత ఇవ్వేలేదు. కాగా, ఇమ్మిగ్రేషన్ అడ్వకేసీ గ్రూప్ (FWD) అంచనా ప్రకారం సుమారు 10 మిలియన్ల మంది పత్రాలు లేని వలసదారులు గ్రీన్ కార్డ్ హోల్డర్ల ఇళ్లలో నివసిస్తున్నట్టు తెలుస్తోంది.






