- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హార్వర్డ్‌కు భారీ షాక్.. ట్రంప్ షాకింగ్ నిర్ణయం !
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Trump) మరో షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. హార్వర్డ్ యూనివర్సిటీ ( Harvard University)

దిశ, వెబ్ డెస్క్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Trump) మరో షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. హార్వర్డ్ యూనివర్సిటీ ( Harvard University) విదేశీ విద్యార్థులను చేర్చుకోకుండా... నిషేధం విధించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు హార్వర్డ్ సర్టిఫికేషన్ రద్దు చేస్తున్నట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ హోల్యాండ్ సెక్యూరిటీ లేఖ కూడా పంపింది. ప్రస్తుతం హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుతున్న విదేశీ విద్యార్థులు మరో వర్సిటీకి బదిలీ కావాలని కూడా ఆదేశాలు జారీ చేశారు.
ఈ రూల్స్ ఎవరైనా బ్రేక్ చేస్తే చట్టబద్ధ హోదా కోల్పోతారని కూడా... లేఖలో పేర్కొన్నారు. దీంతో విదేశీ విద్యార్థులు గందరగోళంలో పడిపోయారు. అమెరికా అధ్యక్ష బాధ్యత తీసుకున్న తర్వాత డోనాల్డ్ ట్రంప్... నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచ దేశాలకు షాక్ ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు విద్యార్థుల చదువులపై కూడా... ట్రంప్ కన్ను పడింది.
ఈ నేపథ్యంలోనే హర్వర్డ్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థులు అడ్మిషన్లను నిలిపివేసింది ట్రంప్ సర్కార్. ఇకపై కొత్త అంతర్జాతీయ విద్యార్థులను చేర్చుకోకుండా చేసింది. 2025- 2026 విద్యా సంవత్సరంలో ఏ ఒక్క విదేశీ విద్యార్థి కూడా హార్వర్డ్ యూనివర్సిటీలో అడ్మిషన్లు ఇకపైన పొందకుండా ఉత్తర్వులు జారీ చేసింది డోనాల్డ్ ట్రంప్ సర్కార్. దీనిపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది.






