- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Trump: బిగ్ బ్యూటిఫుల్ బిల్లుకు ఆమోదం.. ట్రంప్‌కు భారీ విజయం
by B.Srinivas |
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లుకు అమెరికా పార్లమెంట్ ఆమోదించింది.

X
దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీసుకొచ్చిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లు (Big beautiful bill) కు అమెరికా పార్లమెంట్ ఆమోదించింది. ఆ దేశ దిగువ సభలో దీనిపై ఓటింగ్ జరగగా బిల్లుకు మద్దతుగా 218 మంది ఓటు వేయగా, వ్యతిరేకంగా 214 మంది ఓటు వేశారు. దీంతో ఈ బిల్ పాస్ అవ్వగా ట్రంప్ సంతకం కోసం పంపించారు. ట్రంప్ సంతకం చేసిన అనంతరం ఇది చట్టంగా మారుతుంది. ట్రంప్ సొంత పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసినట్టు సమాచారం. దీంతో వివాదాస్పదంగా మారిన ఈ బిల్లును ఆమోదించడంతో ట్రంపునకు బారీ విజయం సాధించినట్టు అయింది. అంతకుముందు బిల్లు సెనేట్ లో ఆమోదం పొందింది. కాగా, బిగ్ బ్యూటిఫుల్ బిల్లులో సైనిక వ్యయాన్ని పెంచడం, వలసదారుల బహిష్కరణకు నిధులు కేటాయించడం, పన్ను కోతలు సహా వివిధ కీలక అంశాలున్నాయి.
Next Story






