- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ట్రంప్-పుతిన్ మీటింగ్ కన్ఫర్మ్.. అలస్కా వేదికగా ఆగస్టు 15న భేటీ!
by Phanindra |
ట్రంప్-పుతిన్ మీటింగ్ కన్ఫర్మ్ అయింది. అలస్కా వేదికగా ఆగస్టు 15న ఇద్దరు నేతలు భేటీ అవనున్నారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ఆపడంపై చర్చించనున్నారు.

X
దిశ, నేషనల్ బ్యూరో: ఆగస్టు 15న అలస్కా వేదికగా యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ కలవబోతున్నారు. ఈ సమావేశంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గురించి చర్చిస్తామని ట్రంప్ ప్రకటించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్‌స్కీ, పుతిన్ ఇద్దరూ కూడా సీజ్‌ఫైర్ డీల్ చేసుకోవడానికి చాలా సమీపానికి వచ్చారని, ఈ డీల్ ప్రకారం ఉక్రెయిన్ కొంత భూభాగాన్ని కోల్పోనుందని సమాచారం.
రష్యా, ఉక్రెయిన్ దేశాలు కొన్ని భూభాగాలను పంచుకోబోతున్నాయని, ఇది ఇరుదేశాలకు ఉపయోగపడుతుందని ట్రంప్ చెప్పారు. పుతిన్ ప్రతినిధి యూరీ ఉషకోవ్ కూడా దీనిపై స్పందించారు. పుతిన్, ట్రంప్ ఇద్దరూ కూడా ఉక్రెయిన్ సంక్షోభానికి తెరదించేందుకు ప్రయత్నిస్తారని ఉషకోవ్ తెలిపారు. అలస్కాకు పుతిన్ వెళ్లిన తర్వాత.. ట్రంప్‌ను కూడా తమ దేశంలో పర్యటించాలని రష్యా కోరినట్లు సమాచారం.
Next Story






