- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Trinamool: అఖిలపక్ష బృందం నుంచి తప్పుకున్న యూసఫ్ పఠాన్
ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ ఉగ్రకుట్రలను ప్రపంచానికి తెలియజేసేందుకు ఏడు బృందాలు విదేశాలకు వెళ్తున్నాయి. అయితే, ఈ బృందాల సభ్యుల ఎంపిక విషయంలో కేంద్రంపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

దిశ, నేషనల్ బ్యూరో: ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ ఉగ్రకుట్రలను ప్రపంచానికి తెలియజేసేందుకు ఏడు బృందాలు విదేశాలకు వెళ్తున్నాయి. అయితే, ఈ బృందాల సభ్యుల ఎంపిక విషయంలో కేంద్రంపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. నిన్నటి వరకు శశిథరూర్ ఎంపికపై కాంగ్రెస్ అసహనం వ్యక్తం చేయగా.. ఇప్పుడు టీఎంసీ నేత యూనస్ పఠాన్ ఎంపికపై దీదీ పార్టీ మండిపడుతోంది. ఈ బృందం నుంచి తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎంపీ యూసఫ్ పఠాన్ (Yusuf Pathan) తప్పుకున్నారు. తమను సంప్రదించకుండానే పఠాన్ ఎంపిక జరిగిందంటూ ఆ పార్టీ జాతీయ కార్యదర్శి అభిషేక్ బెనర్జీ కేంద్రంపై విమర్శలు చేశారు. పఠాన్ ఈ ఎంపికను టీఎంసీ తప్పుబట్టింది. తమను సంప్రదించకుండా పఠాన్‌ను దౌత్యబృందంలో చేర్చడం సమంజసం కాదని అభిషేక్ బెనర్జీ పేర్కొన్నారు. ఒక పార్టీ ఎంపీని ఎంపిక చేసేటప్పుడు ఆ పార్టీతో సంప్రదింపులు జరపాలని కేంద్రానికి సూచించారు. అంతేకాక.. కేంద్రం నిర్ణయించిన దౌత్య బృందం పర్యటనకు పఠాన్ వెళ్లడం లేదని స్పష్టంచేశారు. అభిషేక్ బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ.. "దేశ జాతీయ ప్రయోజనాలను కాపాడటానికి ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా, టీఎంసీ సర్కారుకు అండగా నిలబడుతుంది. అయితే, ప్రతినిధి బృందం వెళ్లడంలో మాకు సమస్య లేదు, కానీ మా పార్టీలోని ఏ సభ్యుడు ప్రతినిధి బృందంలో వెళ్లాలనేది మా పార్టీ నిర్ణయం. "మీరు (కేంద్రం) ప్రతినిధి బృందంలో ఒక సభ్యుడిని కోరితే, మేం ఐదుగురిని పంపగలము. కానీ కేంద్రం తన ఉద్దేశాన్ని చూపించి, ప్రతిపక్షంలోని అన్ని పార్టీలతో విస్తృత చర్చకు పిలుపునివ్వాలి" అని ఆయన అన్నారు.
టీఎంసీపై బీజేపీ విమర్శలు
కాగా.. తృణమూల్ పార్టీపై అధికార బీజేపీ విమర్శలు గుప్పించింది.ఆ పార్టీ రాజకీయాలు చేస్తుందని మండిపడింది. ప్రతినిధి బృందం నుంచి యూసఫ్ పఠాన్ ను తప్పుకోవడంపై బీజేపీ అధికార ప్రతినిధి ఆర్పీ సింగ్ స్పందించారు. ప్రపంచవ్యాప్త ప్రచారం ఒక వ్యక్తిగత పార్టీకి సంబంధించినది కాదని.. "దేశానికి ప్రాతినిధ్యం వహించడం" గురించి అని అన్నారు. "ప్రభుత్వం ఇప్పటికే వివిధ పార్టీలకు అభ్యర్థన లేఖలు పంపింది. కానీ వారు సకాలంలో దానికి స్పందించకపోతే, ప్రభుత్వం ఈ ప్రతినిధులతో ముందుకు సాగాలి. ప్రభుత్వం పార్టీల కోసం వేచి ఉండదు" అని ఆయన అన్నారు. రాజకీయాలు చేసే బదులు టీఎంసీ సభ్యులు కేంద్రంతో సహకరించాలని అని అన్నారు. పహెల్గాం ఘటన నేపథ్యంలో భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (Operation sindoor) గురించి ప్రపంచ దేశాలకు వివరించడానికి భారత్ దౌత్యయుద్ధం ప్రారంభించింది. ఇందులోభాగంగా మొత్తం 51 మంది నేతలు 7 బృందాలుగా విదేశాల్లో పర్యటించనున్నారు. ఈ బృందాల్లో పలు రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు, మాజీ ఎంపీలు, మంత్రులు, దౌత్యవేత్తలు ఉన్నారు. ఒక్కో బృందంలో ఒక ముస్లిం నేత గానీ, అధికారి గానీ ఉండేలా చర్యలు తీసుకున్నారు. 51 మందిలో 31 మంది ఎన్డీయే నేతలు, 20 మంది ఎన్డీయేతర పార్టీల నేతలున్నారు. ‘ఒకే లక్ష్యం.. ఒకే సందేశం.. ఒకే భారత్’ పేరుతో ఈ పర్యటనలు సాగనున్నాయి.






