ప్రధాని మోడీది ఫ్లాప్ సినిమా.. తృణమూల్ ఎంపీ సెటైర్లు

by Dishanational1 |
ప్రధాని మోడీది ఫ్లాప్ సినిమా.. తృణమూల్ ఎంపీ సెటైర్లు
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల చేస్తున్న తన పదేళ్ల పాలన ట్రైలర్ వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ విమర్శలు చేశారు. ప్రధాని తన 10 ఏళ్ల పాలనను ట్రైలర్ మాత్రమే అంటున్నారు కానీ మొత్తంగా ఆయన సినిమా ఫ్లాప్ అయ్యిందని సెటైర్లు వేశారు. అంతేకాకుండా ప్రజలకు హామీలు ఇచ్చి నెరవేర్చని అతిపెద్ద అబద్దాలకోరు అని తీవ్రంగా స్పందించారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన ఎంపీ.. కేంద్రం 'బేటీ బచావో, బేటీ పడావో' ప్రచారానికి వేల కోట్ల రూపాయలను అందజేస్తానని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు. ఈ క్యాంపెయిన్ పేరుతో ఎక్కడెక్కడ డబ్బు ఖర్చు చేశారో వివరంగా లిస్ట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా 2014 నుంచి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చెబుతూ వచ్చారు, గడిచిన 10 ఏళ్లలో ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలన్నారు. మోడీ అబద్దాలకోరు అని, నకిలీ నటుడని, ప్రజలకు నకిలీ నటుడు మోడీకి, ఆయన పార్టీ బీజేపీకి ఓటు వేయొద్దని కళ్యాణ్ బెనర్జీ విమర్శలు చేశారు. ప్రధానీ మోడీ ట్రైలర్‌లోనే ఫెలియ్ అయ్యారు, ఆయన సినిమా ఇక ఆడదు, మోడీ తిరిగి గుజరాత్‌కు వెళ్లిపోవాల్సిందేనని ఎద్దేవా చేశారు.


Next Story

Most Viewed