- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Terror Attack : జమ్ముకాశ్మీర్ ఉగ్రదాడి... చేసింది తామేనని ప్రకటించిన TRF
జమ్ముకాశ్మీర్లో(Jammu & Kashmir) మంగళవారం ఉగ్రవాదులు దాడి(Terror Attack) జరిపిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : జమ్ముకాశ్మీర్లో(Jammu & Kashmir) మంగళవారం ఉగ్రవాదులు దాడి(Terrorist Attack) జరిపిన సంగతి తెలిసిందే. అనంత్ నాగ్ జిల్లా పహల్గాం(Pahalgoan)లో ట్రెక్కింగ్ చేస్తున్న పర్యాటకులే(Tourists) లక్ష్యంగా ఉగ్రవాదులు జరిపిన ఈ దాడిలో ముగ్గురు టూరిస్టులు అక్కడిక్కడే మరణించగా.. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. గాయపడిన క్షతగాత్రులు మహారాష్ట్ర, గుజరాత్, యూపీకి చెందిన వారుగా గుర్తించారు అధికారులు. కాగా ఈ ఉగ్రదాడి జరిపింది తామేనని పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న TRF అనే ఉగ్రసంస్థ ప్రకటించింది.
కాగా ఈ ఘటనపై ప్రస్తుతం జెడ్డా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) స్పందించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amith Sha)కు ఫోన్ చేసి దాడి వివరాలు తెలుసుకున్నారు. తక్షణమే ఘటనాస్థలాన్ని సందర్శించాలని, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించాలని మోడీ అమిత్ షాను కోరినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఈ సంఘటనపై కేంద్ర హోంశాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు అమిత్ షా. ఇక ఈ దుశ్చర్యపై జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా(CM Omar Abdullah) తీవ్రంగా ఖండించారు.






