- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Trending: హీరో దళపతి విజయ్ సంచలనం.. తమిళ వెట్రి కజగం పార్టీ జెండా ఆవిష్కరణ
దేశ వ్యాప్తంగా ఆశేష ప్రేక్షకాదరణ పొందిన హీరో దళపతి విజయ్ ఇటీవలే తమిళ వెట్రి కజగం పార్టీని స్థాపించి రాజకీయ రంగ ప్రవేశం చేశారు.

దిశ, వెబ్‌డస్క్: దేశ వ్యాప్తంగా ఆశేష ప్రేక్షకాదరణ పొందిన హీరో దళపతి విజయ్ ఇటీవలే తమిళ వెట్రి కజగం పార్టీని స్థాపించి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో పార్టీ తరఫున అభ్యర్థులను బరిలోకి దింపబోతున్నట్లుగా ప్రకటించారు. అదేవిధంగా పార్టీ ప్రధాన లక్ష్యం, విధి విధానాల రూపకల్పన బిజీబిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే గురువారం ఆయన తమిళ వెట్రి కజగం పార్టీ జెండాను నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమిళనాడు సంక్షేమం కోసం పాటుపడుతూ.. మన రాష్ట్రానికి ప్రతీకగా నిలిచే మన వీర జెండా.. విజయ పతాకమిదే అని స్పష్టం చేశారు. జెండాతో పాటు పార్టీ పేరు మీద ఓ పాటను కూడా రిలీజ్ చేశారు. ఇక నుంచి తమిళ వెట్రి కజగం పార్టీ జెండా దేశవ్యాప్తంగా ఎగురుతుందని ఇకపై తమిళనాడు గెలుస్తుందని గర్జించారు. కాగా, పార్టీ జెండా ఎరుపు, పసుపు రంగులో రూపొందించారు. పతాకం మధ్య భాగంలో జంట ఏనుగులు, ఫ్లవర్స్ ఉన్నాయి.






