- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
EAM: పాక్ లో మైనారిటీలపై దాడులు పెరిగాయి- జైశంకర్
పాకిస్థాన్ లో మైనారిటీలపై విస్తృతంగా దాడులు జరుగుతున్నాయని కేంద్ర విదేశాంగమంత్రి జైశంకర్(Jaishankar) చెప్పుకొచ్చారు.

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్థాన్ లో మైనారిటీలపై విస్తృతంగా దాడులు జరుగుతున్నాయని కేంద్ర విదేశాంగమంత్రి జైశంకర్(Jaishankar) చెప్పుకొచ్చారు. పార్లమెంటు సమావేశాల్లో మాట్లాడుతూ.. పాకిస్థాన్ పై విరుచుకు పడ్డారు. పాక్ లోని మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయని.. వాటిని భారత్ నిశితంగా పరిశీలిస్తోందని చెప్పుకొచ్చారు. అంతర్జాతీయ సమాజం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తామన్నారు. అక్కడి హిందువులు సహాహా ఇతర మైనారిటీలపై జరిగిన ఘాతుకాల గురించి ప్రస్తావించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో హిందువులపై 10, సిక్కులపై 3 కేసులు నమోదయ్యాయని అన్నారు. ఇతర మైనారిటీల పైనా కేసులు ఉన్నట్లు తెలియజేశారు. అక్కడి హిందువులను బలవంతంగా మతం మార్పించడానికి కూడా ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఈ కేసులను అంతర్జాతీయ స్థాయిలో పరిశీలిస్తామన్నారు. పాకిస్థాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న అంశాన్ని ఐక్యరాజ్య సమితిలోని (UN) భారత ప్రతినిధులు లేవనెత్తారని అన్నారు. ఈ చర్యలతో ఆ దేశం ప్రజాస్వామ్య, మానవ హక్కుల విలువలను ఉల్లంఘిస్తోందని వారు పేర్కొన్నారని తెలిపారు. అంతేకాకుండా, యూఎన్ జనరల్ అసెంబ్లీలోనూ భారత రాయబారి పాక్ సమస్యను లేవెనత్తినట్లు చెప్పుకొచ్చారు. పాక్ మతోన్మాద మనస్తత్వాన్ని, మతతత్వ రికార్డుని చూపించినట్లు పేర్కొన్నారు. మరోవైపు, మార్చి 26న హ్యూమన్ రైట్స్ ఫోకస్ పాకిస్థాన్ (HRFP) 2025 ఒక నివేదికను విడుదల చేసిందన్నారు. దాంట్లో, పాక్ లో బాధితుల సంఖ్య, మతపరమైన మైనార్టీలు ఎదుర్కొంటున్న సవాళ్లు అధికమయ్యాయని ఉన్నట్లు తెలిపారు.






