ఆరని మరాఠీ మంటలు.. ముంబైలో మరోసారి రచ్చ

by Ajay Maddhiboyina |

మ‌హ‌రాష్ట్ర‌లో మొద‌లైన భాషా వివాదం ఇప్ప‌టికీ కొనసాగుతూనే ఉంది. తాజాగా ఓ ట్రావెల్ వ్లాగ‌ర్ హిందీ మాట్లాడుతూ వీడియోలు తీయ‌గా మ‌రాఠీ మాట్లాడాలంటూ అత‌డితో కొంద‌రు వాగ్వాదానికి దిగారు.

ఆరని మరాఠీ మంటలు.. ముంబైలో మరోసారి రచ్చ
X

దిశ‌, వెబ్ డెస్క్: మ‌హ‌రాష్ట్ర‌లో మొద‌లైన భాషా వివాదం ఇప్ప‌టికీ కొనసాగుతూనే ఉంది. తాజాగా ఓ ట్రావెల్ వ్లాగ‌ర్ హిందీ మాట్లాడుతూ వీడియోలు తీయ‌గా మ‌రాఠీ మాట్లాడాలంటూ అత‌డితో కొంద‌రు వాగ్వాదానికి దిగారు. ట్రావెల్ వ్లాగ‌ర్ విజ‌య్ చందేల్ మ‌రాఠీ మాట్లాడ‌డానికి నిరాక‌రిస్తున్న‌ట్టు వీడియోలో క‌నిపిస్తుంది. వినాయ‌క చ‌వితి వేడుక‌ల సంద‌ర్భంగా ఈ ఘ‌ట‌న చోటు చేసుకున్న‌ట్టు తెలుస్తోంది. వ్లాగ‌ర్ గ‌ణేష్ వేడుక‌ల గురించి చెబుతూ ఓ కారులో ప్ర‌యాణిస్తున్న స‌మ‌యంలో ప‌క్కన ఉన్న వ్య‌క్తి.. మీరు మ‌రాఠీ మాట్లాడ‌తారా? అని ప్ర‌శ్నించగా.. అత‌డు గ‌ట్టిగా నేను మ‌రాఠీ మాట్లాడ‌ను హిందీనే మాట్లాడ‌తాన‌ని..ఇది భారతదేశం అని చెప్పాడు.

దీంతో కారులో ఉన్న ఇద్ద‌రు మ‌హిళ‌ల‌కు కింద‌కు దిగి నువ్వు మ‌హ‌రాష్ట్ర‌లో ఉంటున్నావు మ‌రాఠీ నేర్చుకోవాల‌ని అన్నారు. కానీ అత‌డు వెన‌క్కి త‌గ్గ‌కుండా నేను చ‌చ్చేవ‌ర‌కు మ‌రాఠీ మాట్లాడ‌న‌ని హిందీ మాత్ర‌మే మాట్లాడ‌తాన‌ని చెబుతాడు. ఈ గొడ‌వ త‌ర‌వాత వ్లాగ‌ర్ పోలీసుల‌కు సైతం ఫిర్యాదు చేశాడు. ఇదిలా ఉంటే గ‌త కొన్ని నెల‌లుగా మ‌హారాష్ట్ర‌లో మ‌రాఠీ ఉద్య‌మం జ‌రుగుతోంది. హిందీ మాట్లాడుతూ ఎవ‌రు క‌నిపించినా నిల‌దీస్తూ గొడ‌వ‌కు దిగుతున్నారు. మ‌రాఠీని కాపాడాల‌ని నిర‌స‌న‌లు సైతం చేప‌డుతున్నారు.

Next Story