- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Travel Destination List: 2024లో భారతీయులు గూగుల్ లో ఎక్కువగా సెర్చ్ చేసిన ట్రావెల్ డెస్టినేషన్లు ఏవి..?
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్(Google) ప్రతి సంవత్సరం అత్యధికంగా వెతికిన టాపిక్స్ లిస్ట్(Topics List)ను ఏడాది చివర్లో విడుదల చేస్తుంటుంది.

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్(Google) ప్రతి సంవత్సరం అత్యధికంగా వెతికిన టాపిక్స్ లిస్ట్(Topics List)ను ఏడాది చివర్లో విడుదల చేస్తుంటుంది. అందులో భాగంగా 2024లో భారతీయులు గూగుల్ లో ఎక్కువగా సెర్చ్ చేసిన ట్రావెల్ డెస్టినేషన్ లిస్ట్(Travel Destination List)ను ప్రకటించింది. వాటిలో యూరేషియా దేశమైన రిపబ్లిక్ ఆఫ్ అజర్‌బైజాన్(Republic of Azerbaijan) మొదటి స్థానంలో నిలిచింది. ఇక ఇండోనేషియా(Indonesia)లోని అందమైన ద్వీపమైన్ బాలి(Bali) రెండో స్థానంలో నిలిచింది. మన దేశానికి చెందిన పర్యాటక ప్రాంతం మనాలి(Manali) మూడో స్థానంలో ఉంది. ఇక కజకిస్థాన్, జైపూర్ నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచాయి. ఆ తర్వాత జార్జియా, మలేషియా, అయోధ్య, కశ్మీర్, సౌత్ గోవా ఆరు నుంచి పదో స్థానాల్లో నిలిచాయి. కాగా గూగుల్ ఈ ఏడాది అత్యధికంగా సెర్చ్ చేసిన సినిమాలు(Movies), పదాలు(Words), వ్యక్తులు(persons), ఫుడ్(Food) జాబితాను కూడా తాజాగా విడుదల చేసిన విషయం తెలిసిందే.






