స్కామ్ కాల్స్‌కు చెక్ పెట్టేందుకు ట్రాయ్ కీలక నిర్ణయం

by Ajay Maddhiboyina |

స్కామ్ కాల్స్ కు చెక్ పెట్టేందుకు ట్రాయ్ (Telecom Regulatory Authority of India) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇక‌పై ఇన్సూరెన్స్ కంపెనీల నుండి వ‌చ్చే కాల్స్ అన్నీ త‌ప్ప‌నిస‌రిగా

స్కామ్ కాల్స్‌కు చెక్ పెట్టేందుకు ట్రాయ్ కీలక నిర్ణయం
X

దిశ‌, వెబ్ డెస్క్: స్కామ్ కాల్స్ కు చెక్ పెట్టేందుకు ట్రాయ్ (Telecom Regulatory Authority of India) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇక‌పై ఇన్సూరెన్స్ కంపెనీల నుండి వ‌చ్చే కాల్స్ అన్నీ త‌ప్ప‌నిస‌రిగా 1600 సిరీస్ నంబ‌ర్ల నుండే రావాల‌ని పేర్కొంది. ఈ నిబంధ‌న ఐఆర్డీఏఐ ప‌రిధిలోని అన్ని బీమా సంస్థ‌లు వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి 15 నాటికి అమ‌లు చేయాల‌ని చెప్పింది. ఇదిలా ఉంటే ఇన్సూరెన్స్ కంపెనీల పేరుతో స్పామ్ కాల్స్ పెరిగిపోతున్న సంగ‌తి తెలిసిందే.

అనేక నంబ‌ర్ల నుండి కాల్స్ వ‌స్తుండ‌టంతో వినియోగ‌దారులు సైబ‌ర్ నేర‌గాళ్ల మాయ‌లో ప‌డి సైతం కొన్నిసార్లు మోస‌పోతున్నారు. దీంతో అలాంటి కాల్స్ కు చెక్ పెట్టాల‌ని ట్రాయ్ భావిస్తోంది. ఒకే నంబ‌ర్ తో ఇన్సూరెన్స్ కంపెనీల నుండి ఫోన్స్ రావ‌డం వ‌ల్ల క‌స్ట‌మ‌ర్ మోస‌పోయేందుకు అవ‌కాశం ఉండ‌దు. అంతే కాకుండా అవ‌సరం అనుకుంటేనే ఆ కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడ‌తాడు. కాబ‌ట్టి ట్రాయ్ తీసుకున్న నిర్ణ‌యం మొబైల్ ఫోన్ వినియోగ‌దారుల‌కు సైతం ఎంతో మేలు చేయ‌నుంది.

Next Story