- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > దేశం-విదేశం > బారామతిలో కుప్పకూలిన శిక్షణ విమానం.. గతంలో ఇదే ప్రాంతంలో అజిత్ పవార్‌కు ప్రమాదం
బారామతిలో కుప్పకూలిన శిక్షణ విమానం.. గతంలో ఇదే ప్రాంతంలో అజిత్ పవార్‌కు ప్రమాదం
by Ramesh Naini |
మహారాష్ట్రలోని బారామతి సమీపంలోని గోజుబావి గ్రామంలో బుధవారం ఓ శిక్షణ విమానం కుప్పకూలింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: మహారాష్ట్రలోని బారామతి సమీపంలోని గోజుబావి గ్రామంలో బుధవారం ఓ శిక్షణ విమానం కుప్పకూలింది. రెడ్‌బర్డ్ ఏవియేషన్‌కు చెందిన ఈ విమానంలో ఉన్న ట్రైనీ పైలట్ ప్రాణాపాయం నుంచి సురక్షితంగా బయటపడ్డారని ప్రాథమిక సమాచారం. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. శిథిలాల సాంకేతిక పరిశీలన అనంతరం పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.
కాగా, ఇదే బారామతి ప్రాంతంలో గత ఫిబ్రవరిలో జరిగిన విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ అగ్రనేత అజిత్ పవార్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ విషాదం జరిగిన కొన్ని నెలల వ్యవధిలోనే తాజాగా మరో విమానం కుప్పకూలడం గమనార్హం.
Next Story






