- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మిజోరంలో 78 ఏళ్ల తర్వాత రైలు ప్రయాణం ప్రారంభం
భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనతో మిజోరంలో ఓ చారిత్రాత్మక ఘట్టం నెలకొంది.

దిశ, వెబ్‌డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) పర్యటనతో మిజోరంలో ఓ చారిత్రాత్మక ఘట్టం (Historic event) నెలకొంది. స్వాతంత్ర్యం వచ్చిన 78 ఏళ్ల తర్వాత తొలిసారిగా మిజోరం రాజధాని ఐజాల్‌కు నేరుగా రైలు కనెక్టివిటీ (Rail connectivity) లభించింది. ఇప్పటి వరకు మిజోరంలో బైరాబి వరకు మాత్రమే రైల్వే లైన్ ఉండేది. కానీ తాజాగా పూర్తి చేసిన బైరాబి–సైరాంగ్ రైల్వే లైన్ (Bairabi–Sairang railway line) (సుమారు 51 కిలోమీటర్లు) ద్వారా ఐజాల్ రైల్వే నెట్‌వర్క్‌తో కలిసింది. దీంతో మిజోరం ప్రజలకు రవాణా సౌకర్యాలు మరింత సులభం కానున్నాయి. ఈ ప్రాజెక్ట్ నార్త్‌ఈస్ట్‌లో రైల్వే అభివృద్ధికి పెద్ద అడుగుగా భావిస్తున్నారు. భారత స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు మిజోరం రాజధానికి రైల్వే లైన్ లేకపోవడం ఇన్ని రోజులు ఆ ప్రాంతానికి ఓ కలతగా ఉండేది. ఈ రోజు ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభం (Launched by Prime Minister Modi) అయిన ఇది రాష్ట్రానికి నిజమైన “మొదటి రైలు కనెక్టివిటీ”గా గుర్తించబడింది.






