Train hijack: ట్రైన్ హైజాక్ ఘటనలో బందీలంతా సేఫ్.. పాక్ ఆర్మీ ప్రకటన

by B.Srinivas |

రైలు హైజాక్ ఘటనలో బందీలందరినీ రక్షించినట్టు పాక్ సైన్యం తెలిపింది. బలోచ్ వేర్పాటువాదులందరినీ హతమార్చినట్టు వెల్లడించింది.

Train hijack: ట్రైన్ హైజాక్ ఘటనలో బందీలంతా సేఫ్.. పాక్ ఆర్మీ ప్రకటన
X

దిశ, నేషనల్ బ్యూరో: రైలు హైజాక్ ఘటనలో బందీలందరినీ రక్షించినట్టు పాక్ సైన్యం బుధవారం తెలిపింది. ట్రెయిన్‌ను హైజాక్ చేసిన బలోచ్ వేర్పాటువాదులందరినీ హతమార్చినట్టు వెల్లడించింది. పాక్ భద్రతా దళాలు ఘటనలో పాల్గొన్న 33 మంది బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) ఉగ్రవాదులను విజయవంతంగా మట్టుబెట్టాయని పేర్కొంది. ఒక రోజంతా జరిగిన సైనిక చర్య తర్వాత వేర్పాటు వాదులను హతమార్చి ఆపరేషన్‌ను సక్సెస్ ఫుల్‌గా ముగించినట్టు తెలిపింది. బీఎల్ఏ జరిపిన కాల్పుల్లో 21 మంది ప్రయాణికులు, నలుగురు పారామిలటరీ సైనికులు ప్రాణాలు కోల్పోయినట్టు పాక్ ఆర్మీ ప్రతినిధి తెలిపారు. ‘పాకిస్థాన్ సాయుధ దళాలు ఉగ్రవాదులను హతమార్చాయి. అంతేగాక ప్రయాణీకులను సురక్షితంగా రక్షించాయి. దీంతో ఆపరేషన్‌ను విజయవంతంగా కంప్లీట్ అయింది’ అని లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ తెలిపారు. రక్షించబడిన ప్రయాణీకులను వారి స్వస్థలాలకు పంపుతున్నామని, మొత్తం 300 మందికి పైగా బందీలను రక్షించినట్టు వెల్లడించారు.

బలూచిస్తాన్‌లోని బోలాన్ జిల్లా మష్కాఫ్ ప్రాంతంలో బీఎల్ఎఫ్ తిరుగుబాటు దారులు రైలును మంగళవారం హైజాక్ చేశారు. కొంత మంది ప్రయాణికులు చంపేసి మరికొంత మందిని బందీలుగా చేసుకున్నారు. జైలులో ఉన్న బీఎల్ఎఫ్ సభ్యులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలా అయితే బందీలను సురక్షితంగా విడుదల చేస్తామని తెలిపారు. దీంతో రంగంలోకి దిగిన పాక్ ప్రభుత్వం బలూచ్ వేర్పాటు వాదుల డిమాండ్లను తిరస్కరించి బందీలను రక్షించేందుకు చర్యలు చేపట్టింది. సైన్యాన్ని రంగంలోకి దింపి ఆపరేషన్ చేపట్టింది. ఈ క్రమంలోనే బందీలందరినీ రక్షించడంతో పాటు రైలు హైజాక్ లో పాల్గొన్న ఉగ్రవాదులందరినీ మట్టుబెట్టింది.

Next Story