- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జల్లికట్టు పోటీల్లో అపశృతి.. 52 మందికి గాయాలు
by Naga Rani Yarlagadda |
మదురైలోని అవనియాపురంలో గురువారం నిర్వహించిన జల్లికట్టు పోటీల్లో అపశృతి చోటుచేసుకుంది. 10వ రౌండ్లో ఎద్దులను ఆపేందుకు వెళ్లిన యువకుల్లో 54 మందికి గాయపడ్డారు.

X
దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులో సంక్రాంతి సంబరాలంటే గుర్తొచ్చేది జల్లికట్టు. తెలుగురాష్ట్రాల్లో సంక్రాంతి వేడుకల్లో కోడిపందేలు ఎంత ఫేమస్సో.. అక్కడ జల్లికట్టు అంత ఫేమస్. ఎద్దులతో యువకులు పోరాడి వాటిని ఆపడానికి చేసే ప్రయత్నాలను చూసేందుకు వేలాదిమంది ప్రజలు తరలివస్తారు. మదురైలోని అవనియాపురంలో గురువారం నిర్వహించిన జల్లికట్టు పోటీల్లో అపశృతి చోటుచేసుకుంది. 10వ రౌండ్లో ఎద్దులను ఆపేందుకు వెళ్లిన యువకుల్లో 54 మందికి గాయపడ్డారు. వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడినవారిలో ఎద్దుల పోరాట యోధులు27, వాటి యజమానులు 20, ప్రేక్షకులు ఏడుగురు ఉన్నట్లు సమాచారం. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Next Story






