Trade deal: ఆగస్ట్ 25న భారత్‌కు అమెరికా బృందం.. వాణిజ్య ఒప్పందంపై తదుపరి చర్చలు

by B.Srinivas |

అమెరికా, భారత్‌ల మధ్య ట్రేడ్ డీల్ కోసం చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు మార్లు ఇరు దేశాల ప్రతినిధులు దీనిపై డిస్కస్ చేశారు.

Trade deal: ఆగస్ట్ 25న భారత్‌కు అమెరికా బృందం.. వాణిజ్య ఒప్పందంపై తదుపరి చర్చలు
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా, భారత్‌ల మధ్య ట్రేడ్ డీల్ (Trade deal) కోసం చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు మార్లు ఇరు దేశాల ప్రతినిధులు దీనిపై డిస్కస్ చేశారు. అయితే ఇప్పటికీ వాణిజ్య ఒప్పందంపై స్పష్టత రాలేదు. ఈ క్రమంలోనే తదుపరి రౌండ్ చర్చల నిమిత్తం ఆగస్టు 25న అమెరికా ప్రతినిధి బృందం భారత్‌ను సందర్శించనున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం పై ఆరో రౌండ్ చర్చలు ఇండియాలో జరగనున్నట్టు వెల్లడించాయి. పరస్పర సుంకాలపై ట్రంప్ విధించిన ఆగస్టు 1 గడువుకు ముందే రెండు దేశాలు మధ్యంతర వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఈ కీలక పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన చివరి రౌండ్ చర్చలు అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో జరిగాయి. భారత చీఫ్ నెగోషియేటర్ రాజేష్ అగర్వాల్, అమెరికా వాణిజ్య ప్రతినిధి బ్రెండన్ లించ్ లు ఈ చర్చల్లో పాల్గొన్నారు. అయితే వ్యవసాయ, పాల ఉత్పత్తులపై సుంకం రాయితీలు ఇవ్వాలన్న అమెరికా డిమాండ్‌కు నిరాకరిస్తున్నట్టు తెలుస్తోంది.

Next Story