రాష్ట్రంలో కుండపోత వర్షాలు.. ఆ ప్రాంతంలో నీట మునిగిన రోడ్లు

by Jakkula.Mamatha |

రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

రాష్ట్రంలో కుండపోత వర్షాలు.. ఆ ప్రాంతంలో నీట మునిగిన రోడ్లు
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గుజరాత్‌(Gujarath)లోని పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల(Heavy Rains) కారణంగా సూరత్‌తో సహా పలు ప్రాంతాల్లో రోడ్లు నీట మునిగాయి. సూరత్‌లో(Surath) రోడ్లు నీట మునడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సూరత్‌లోని వేద్ దర్వాజా వద్ద రోడ్లు నీట మునిగాయి. ప్రజలు నీటిలో నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అరవల్లి జిల్లాలో కురిసిన భారీ వర్షానికి నగరంలో పలుచోట్ల జల నిర్బంధం ఏర్పడింది. రహదారులు, లోతట్టు ప్రాంతాలు నీట మునిగి ప్రజలు తీవ్ర అసౌకర్యాలు ఎదుర్కొంటున్నారు. అంతేకాదు రాష్ట్రంలోని అనేక చోట్ల వరదలు(Floods) బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో ప్రజల జీవనం అస్తవ్యస్తమైంది. భారీ వర్షాల కారణంగా అనేక చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. గుజరాత్ ప్రభుత్వం సహాయక చర్యలు చేపడుతోంది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది.

Next Story