ట్రంప్ టెంపరితనానికి భారత్ ఆ ఒక్క పని చేస్తే చాలా?.. అమెరికన్ ఆర్థిక వేత్త సంచలన వ్యాఖ్యలు

by Prasad Jukanti |   (  Updated:2025-08-09 07:31:52  IST  )

ట్రంప్ దూకుడుకు కళ్లేం వేసేందుకు భారత్ పక్కా స్కెచ్ వేస్తోంది.

ట్రంప్ టెంపరితనానికి భారత్ ఆ ఒక్క పని చేస్తే చాలా?.. అమెరికన్ ఆర్థిక వేత్త  సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెరలేపిన సుంకాల (Tariff War) బాదుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను టెన్షన్ పెట్టిస్తోంది. ట్రంప్ (Trump) ఎప్పుడు? ఎలా? ఎవరిపై టారిఫ్ భారం మోపుతాడో తెలియక ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఓ వైపు భారత్ తన మిత్ర దేశం అంటూనే, ప్రధాని మోడీ నా జాన్ జిగిరీని అని ప్రకటిస్తూనే మరోవైపు ఇండియాపై సుంకాల వాతలు పెట్టడం ఆశ్చర్యపరుస్తోంది. 25 శాతం కాదు మీరు 50 శాతం టారిఫ్స్ కట్టాల్సిందేనని ఇందుకు భారత్ గెట్ రెడీ అంటూ సవాళ్లు విసురుతున్నాడు. అయితే ట్రంప్ టెంపరితనాన్ని మౌనంగానే గమనిస్తున్న భారత్ ఆయన దూకుడుకు కళ్లేం వేసేందుకు పక్కా స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది. భారత ప్రయోజనాల విషయంలో ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని రెండు రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) స్పష్టం చేశారు. దీంతో అమెరికా- భారత్ (India) మధ్య సుంకాల అంశం ఎలాంటి పరిణామాలకు దారి తీయబోతున్నది అనే చర్చ జరుగుతున్న వేళ అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్థికవేత్త, జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ స్టీవ్ హాంకీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

భారత్‌ ఓపిక పడితేచాలు:

మిగిలిన ప్రపంచంతో వాణిజ్య యుద్ధం చేస్తూ ట్రంప్ తనను తాను నాశం చేసుకుంటున్నారని స్టీవ్ హాంకీ అన్నారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. సుంకాలపై ట్రంప్ నిర్ణయాలు పూర్తిగా అర్థరహితం అని వ్యాఖ్యానించారు. ట్రంప్ విషయంలో భారత్ కాస్త ఓపిక పడితే చాలని ట్రంప్ సుంకాల పేక మేడ దానంతట అదే కూలిపోతుందన్నారు. ట్రంప్ విషయంలో నెపోలియన్ చెప్పిన 'తనను తాను నాశనం చేసుకునే శత్రువు జోలికి వెళ్లకపోవడమే మంచిది' అనే వాక్కును భారత్ పాటించాలని సూచించారు. అమెరికన్ల స్థూల జాతీయోత్పత్తి కంటే ఎక్కువగా ఖర్చు చేస్తున్నందునా యూఎస్ లో భారీ వాణిజ్య లోటు ఉందన్నారు. ట్రంప్ సుంకాల ఆర్థిక శాస్త్రం పూర్తిగా చెత్త అని కొట్టిపారేశారు.

అమెరికాకే నష్టం:ట్రంప్ నిర్ణయం వల్ల భారత్ కంటే అమెరికన్లకే ఎక్కువ నష్టం అని ఇటీవలే ఎస్బీఐ రిపోర్టు కూడా స్పష్టం చేసింది. సుంకాల ఎఫెక్టుతో ద్రవ్యోల్బణం పెరుగుతుందని దాంతో స్వల్పకాలంలో అమెరికన్ కుంటుంబాల సగటు వ్యయాలు దాదాపు 2,400 డాలర్లు (దాదాపు రూ.2.09 లక్షలు) పెరిగే అవకాశం ఉందని ఎస్బీఐ పరిశోధనా నివేదిక పేర్కొంది. అయినా ట్రంప్ తన మొండిపట్టుతో వ్యవహరించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే ట్రంప్ విషయంలో రాజకీయంగానూ కీలక పరిణామాలు చోటు చేసుకోవచ్చనే చర్చ జరుగుతున్న వేళ భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నదనేది ఆసక్తిగా మారింది.

Next Story