- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్‌లో సమస్యలు.. ఇదే ఫస్ట్ టైం కాదు..!
బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానాల్లో ఇదివరకు కూడా ఎన్నో సమస్యలు తలెత్తాయి. ఇటీవలి కాలంలోనే మూడు కీలక ఘటనలు జరిగాయి.

దిశ, నేషనల్ బ్యూరో: ఎయిరిండియా విమానం అహ్మదాబాద్‌లో కూలిన ఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనతో ఎయిరిండియా ఉపయోగించిన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం భద్రతపై చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. ఎందుకంటే ఈ విమానంలో సమస్యలు తలెత్తడం ఇదే మొదటిసారి కాదు. చాలాసార్లు రకరకాల సమస్యలతో ఈ విమానాలను అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. మనదేశంలో కూడా ఈ విమానాలను ఇటీవలి కాలంలో చాలాసార్లు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసిన ఘటనలున్నాయి.
ఐఆర్‌యూ ఫెయిల్యూర్:
ఈ ఏడాది జనవరి 24న యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం గగనతలంలో ఉండగా సడెన్‌గా ఇనర్షియల్ రిఫరెన్స్ యూనిట్స్ (ఐఆర్‌యూలు) ఫెయిలయ్యాయి. విమానంలో రెండు ఐఆర్‌యూలు ఉండగా రెండూ విఫలమయ్యాయి. దీంతో విమానం సడెన్‌గా ఆల్టిట్యూడ్ కోల్పోయింది. ఈ ప్రమాదంలో 38 మంది ప్రయాణికులు గాయపడగా.. 16 మంది తీవ్రగాయాలతో ఆస్పత్రిపాలయ్యారు. అయితే ఈ ఘటన జరిగినా కూడా నైజీరియాలోని లాగోస్‌లో విమానం సేఫ్‌గానే ల్యాండయింది. ఆ తర్వాత నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (ఎన్టీఎస్‌బీ) దర్యాప్తు చేసి ఐఆర్‌యూ వైఫల్యంతోనే ఈ ప్రమాదం జరిగిందని నిర్ధారించింది. విమానాలు, సబ్‌మెరీన్లు (జలాంతర్గాములు) వంటి వాటి ప్రయాణంలో ఐఆర్‌యూలు చాలా కీలయం.
ఆటోపైలట్ ఫెయిల్:
ఇదే ఏడాది జనవరి 24నే యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన అదే విమానం పశ్చిమ ఆఫ్రికా మీద ఆకాశంలో వెళ్తుండగా విమానం ఆల్టిట్యూడ్ మారిపోయింది. వేగంగా ఈ ఆల్టిట్యూడ్‌లో మార్పులు రావడంతో ప్రయాణికులతోపాటు సిబ్బంది కూడా గాయపడ్డారు. అదే సమయంలో విమానంలోని ఆటోపైలట్ కూడా పనిచేయకుండా పోయింది. దీంతో పైలట్లు మాన్యుయల్‌గా విమానాన్ని కంట్రోల్ చేయాల్సి వచ్చింది. మొదట్లో టర్బలెన్స్ వల్ల ఇలా జరిగిందని అనుకున్నా.. ఆ తర్వాత దర్యాప్తులో సాంకేతిక వైఫల్యాల వల్లే ఇలా జరిగిందని తేలింది.
లాతామ్ ఎయిర్‌లైన్స్ ఘటన..
గతేడాది నవంబరులో లాతామ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఒక బోయింగ్ 787 విమానం సడెన్‌గా ఆల్టిట్యూడ్ కోల్పోయింది. 41 వేల అడుగుల ఎత్తులో వెళ్తున్న విమానం అనూహ్యంగా 300 అడుగులు కిందకు దిగిపోయింది. ఇది ఎంత వేగంగా జరిగిందంటే.. విమానంలోని ప్రయాణికులు, వస్తువులు వెళ్లి సీలింగ్‌కు బలంగా ఢీకొనేంతగా. ఈ ఘటనలో 50 మంది గాయపడ్డారు. 12 మంది ఆస్పత్రిపాలవగా ఒకరి పరిస్థితి చాలా విషమంగా ఉన్నా.. చివరకు ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని సమాచారం. అయితే ఈ ప్రమాదం ఎందుకు జరిగిందనే విషయంపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాలేదు.
ఇతర సమస్యలు..
మరీ సీరియస్ విమాన ప్రమాదాలు కాకపోయినా.. పలు కంపెనీలు వాడుతున్న బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానాల్లో ఎన్నో సమస్యలు బయటపడినట్లు రిపోర్టులు వచ్చాయి. హైడ్రాలిక్ లీకులు, ఫ్లాప్ సమస్యలు, చాలాచోట్ల అత్యవసర ల్యాండింగ్‌లు జరగడం.. వంటి ఘటనలు ఈ విమానాల నాణ్యత, మెయింటెనెన్స్‌పై ప్రశ్నలు లేవనెత్తాయి.






