- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపు ఉదయం కేంద్ర కేబినెట్ భేటీ..వీటిపైనే చర్చ!
రేపు ఉదయం 11 గంటలకు ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. భారత్ పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్: రేపు ఉదయం 11 గంటలకు ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. భారత్ పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ భేటీలో ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులతో పాటూ ఇతర అంశాలపై కూడా చర్చించనున్నారు. ఇప్పటికే ప్రధాని మోడీ త్రివిధ దళాధిపతులు, ముఖ్య కార్యదర్శులతో వరుస సమావేశాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
మరోవైపు పాక్ పై పలు ఆంక్షలు విధించారు. ఆ దేశ పౌరులను భారత్ నుండి వెళ్లిపోవాలని ఆదేశించడంతో పాటూ పాక్ నుండి ఎగుమతులను నిలిపివేశారు. సింధూ నది జలాల ఒప్పందాన్ని సైతం రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించారు. అంతే కాకుండా రేపు దేశమంతటా పలు ప్రాంతాల్లో వైమానిక దాడులపై మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. ఇలాంటి సమయంలో మోడీ కేబినెట్ భేటీ అవ్వడం ఆసక్తికరంగా మారింది. భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది ఉత్కంఠగా మారింది.






