- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు భారత్ బంద్... ఈ ప్రభుత్వ ఆఫీసుల్లో సేవలకు అంతరాయం
దేశవ్యాప్తంగా 10 కేంద్ర కార్మిక సంఘాలు నేడు భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు ఈ బంద్ ప్రకటించాయి.

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా 10 కేంద్ర కార్మిక సంఘాలు నేడు భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు ఈ బంద్ ప్రకటించాయి. 25 కోట్ల మంది కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. దీంతో కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలపై బంద్ ప్రభావం ఉండనుంది. ముఖ్యంగా ఇన్సూరెన్స్, పోస్టల్, బొగ్గు గనులు, బ్యాంకింగ్, పరిశ్రమలు, ప్రజా రవాణా సంస్థలపై ప్రభావం ఉంటుంది.
సమ్మె కారణంగా సహకార బ్యాంకులు పనిచేయకపోయినా ప్రైవేటు బ్యాంకుల్లో సేవలకు ఎలాంటి అంతరాయం ఉంబకపోవచ్చు. పాఠశాలలు ఇతర విద్యా సంస్థలు, ప్రైవేటు ఆఫీసులు యధావిధిగా కొనసాగే అవకాశం ఉంది. విద్యుత్ రంగ ఉద్యోగులు పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొంటున్నారు. కాబట్టి విద్యుత్ కు సంబంధించిన పనుల్లో అంతరాయం కలిగే అవకాశం ఉంది. రైల్వే కార్మికులు సైతం పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొనడంతో రైళ్లు ఆలస్యంగా నడిచే అవకాశాలు ఉన్నాయి.






