ఐ-ప్యాక్ లో ఈడీ సోదాలు.. అమిత్ షా ఆఫీసు ఎదుట టీఎంసీ ఎంపీల నిరసన

by Naga Rani Yarlagadda |

కోల్ కతాలోని ఐ-ప్యాక్ కార్యాలయంలో ఈడీ సోదాలకు వ్యతిరేకంగా టీఎంసీ ఎంపీలు నిరసన చేస్తున్నారు. కేంద్రమంత్రి అమిత్ షా కార్యాలయం ఎదుట తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు నిరసనకు దిగారు.

ఐ-ప్యాక్ లో ఈడీ సోదాలు.. అమిత్ షా ఆఫీసు ఎదుట టీఎంసీ ఎంపీల నిరసన
X

దిశ, వెబ్‌డెస్క్: కోల్ కతాలోని ఐ-ప్యాక్ కార్యాలయంలో ఈడీ సోదాలకు వ్యతిరేకంగా టీఎంసీ ఎంపీలు నిరసన చేస్తున్నారు. కేంద్రమంత్రి అమిత్ షా కార్యాలయం ఎదుట తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు నిరసనకు దిగారు. మహువా మొయిత్రా, శతాబ్ది రాయ్, కీర్తి ఆజాద్, డెరెక్ ఓబ్రియన్ తదితరులు ఈ ఆందోళనలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులే లక్ష్యంగా ఈడీని ఆయుధంగా వాడుతోందని టీఎంసీ ఎంపీలు ఆరోపించారు. బెంగాల్ లో ఓటమిని జీర్ణించుకోలేకనే బీజేపీ ఇలాంటి సోదాలు చేయిస్తోందని విమర్శించారు. కేంద్రహోంమంత్రి అమిత్ షా ఆదేశాల మేరకే ఈడీ పనిచేస్తోందని నినదించారు. ఈ నిరసన ఉద్రిక్తంగా మారడంతో.. పోలీసులు అక్కడికి చేరుకుని ఎంపీలను బలవంతంగా తరలించారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్నా.. తమపట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఎంపీలు మహువా, డెరెక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా చోటుచేసుకున్న ఈ పరిణామాలపై తృణమూల్ నేత అభిషేక్ బెనర్జీ సోషల్ మీడియాలో స్పందించారు. దేశంలో నేరగాళ్లకు రివార్డులు, అత్యాచార నిందితులకు బెయిల్ ఇస్తూ.. నిరసన వ్యక్తం చేసినవారిని జైలుకు పంపే విధానం బీజేపీ పాలనలో కొనసాగుతోందని విమర్శించారు.

Next Story