- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Time magazine: వైట్ హౌజ్ సీటుపై ఎలన్ మస్క్..!
బిలియనీర్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk)ను అమెరికా అధ్యక్షుడిగా పేర్కొంటూ టైమ్ మేగజిన్ (Time magazine) పేర్కొంది.

దిశ, నేషనల్ బ్యూరో: బిలియనీర్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk)ను అమెరికా అధ్యక్షుడిగా పేర్కొంటూ టైమ్ మేగజిన్ (Time magazine) పేర్కొంది. ‘‘ఇన్‌సైడ్ ఎలాన్ మస్క్ వార్ ఆన్ వాషింగ్టన్’’ అనే పేరుతో కవర్ పేజీ స్టోరీ రాసింది. అందులో వైట్ హౌజ్ లోని ఓవల్ ఆఫీస్ లో ప్రెసిడెంట్ సీటులో మస్క్ కాఫీ కప్ తో కూర్చొని ఉన్నట్లు ఉంది. అంతేకాకుండా, ట్రంప్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పట్నుంచి ఇప్పటివరకు మస్క్ చేస్తున్న కృషిని, డోజ్ ద్వారా ప్రభుత్వానికి ఆయన చేస్తున్న సహకారాన్ని వివరించింది. అయితే, ఈ కవర్ స్టోరీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వ్యంగ్యంగా స్పందించారు. టైమ్ మ్యాగజైన్ ఇంకా నడుస్తోందా..? ఇప్పటి వరకు అది ఉన్న విషయమే నాకు తెలియదు అని వెటకారంగా అన్నారు.
టైమ్ మేగజిన్ ఏమందంటే?
అయితే, టైమ్ మేగజిన్ లో ఈ స్టోరీని రాసిన జర్నలిస్టులు మస్క్ గురించి మాట్లాడారు. అమెరికాలో చాలా మంది ప్రభుత్వ ఉద్యోగుల భవిష్యత్ మస్క్ పైనే ఆధారపడి ఉందన్నారు. ఆయన అధ్యక్షుడు ట్రంప్‌నకు తప్ప మరెవరికీ జవాబుదారీగా వ్యవహరించరని పేర్కొన్నారు. తన అజెండాకు అనుగుణంగా ప్రభుత్వ విధానాలు ఉండేలా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారని.. ఈ నేపథ్యంలోనే యూఎస్‌ఎయిడ్‌ను మూసివేయించారని పేర్కొన్నారు. మస్క్ డోజ్ గురించి తాము వైట్‌హౌస్‌కు పంపిన పలు ప్రశ్నలకు అధ్యక్ష భవనం నుంచి ఎటువంటి సమాధానం రాలేదని అన్నారు. అయితే, గతంలోనూ టైమ్ మేగజిన్ మస్క్ ను కవర్ పేజీపై ప్రచురించింది. మరోవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత ట్రంప్‌ను ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా ఎంపిక చేసింది.






