ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు

by Gantepaka Srikanth |

ఢిల్లీ ముఖ్యమంత్రి(Delhi CM) ప్రమాణస్వీకారాని ముహూర్తం ఖరారు అయింది. ఈనెల 20వ తేదీన ఆయనతో పాటు పలువురు మంత్రులు సరిగ్గా సాయంత్రం 4:30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ ముఖ్యమంత్రి(Delhi CM) ప్రమాణస్వీకారాని ముహూర్తం ఖరారు అయింది. ఈనెల 20వ తేదీన ఆయనతో పాటు పలువురు మంత్రులు సరిగ్గా సాయంత్రం 4:30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా, మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఆప్‌(AAP)ను ఓడించి.. బీజేపీ(BJP) ఘన విజయం సాధించింది. దీంతో 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ గడ్డపై కాషాయ జెండా ఎగిరింది. 2019, 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో ఉన్న 7 ఎంపీ సీట్లను బీజేపీ క్లీన్ స్వీప్ చేసినా.. రాష్ట్రంలో మాత్రం అధికారం చేపట్టలేకపోయింది. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు కాషాయ పార్టీకి ఆ లోటు తీరింది.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో(Delhi Assembly Elections) విజయం కోసం కమలనాథులు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లి అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై దృష్టిసారించిన కమలం పార్టీ.. ఈసారి విజయం దక్కించుకుంది. దీనికోసం ఓవైపు ఢిల్లీలో సోషల్ ఇంజినీరింగ్ చేపట్టడంతో పాటు ఆప్ ఇచ్చిన సంక్షేమ పథకాలకు ధీటుగా మరిన్ని హామీలను బీజేపీ ప్రకటించింది. ఇదిలా ఉండగా.. ఆప్, కాంగ్రెస్ రెండూ విడివిడిగా పోటీ చేయడం వల్లే ఓట్లు భారీగా చీలి బీజేపీకి ప్లస్ అయ్యాయని.. ఆ రెండు పార్టీలు కలిసి పనిచేస్తే ఆప్ సులువుగా గెలిచేది అని మరికొందరు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Next Story