- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tik Tok: యూఎస్‌లో టిక్ టాక్‌కు లైన్ క్లియర్.. చైనాతో కుదిరిన అగ్రిమెంట్
టిక్ టాక్‌పై చైనాతో ఒప్పందానికి వచ్చినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.

దిశ, నేషనల్ బ్యూరో: టిక్ టాక్‌పై చైనాతో ఒప్పందానికి వచ్చినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తెలిపారు. ఇరు దేశాల మధ్య ఒక అగ్రిమెంట్ కుదిరిందని, దీని ప్రకారం టిక్ టాక్ తన కార్యకలాపాలను దేశంలో కొనసాగించడానికి వీలు కల్పిస్తుందని తెలిపారు. ఆ సంస్థ యూఎస్ ఆస్తులను చైనా కంపెనీ బైట్‌డాన్స్ నుంయి తీసుకుని అమెరికన్ పెట్టుబడిదారులకు అప్పగిస్తామన్నారు. శుక్రవారం రోజు చైనా ప్రెసిడెంట్ జిన్‌పింగ్‌తో మాట్లాడి మరిన్ని విషయాలను వెల్లడిస్తానని చెప్పారు. రెండు దేశాల మధ్య మంచి వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నామని, ఇది ఇరువురికి ప్రయోజనకరంగా ఉంటుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. అమెరికా చైనాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ట్రంప్ వెల్లడించలేదు.
కాగా, టిక్‌టాక్ మాతృ సంస్థ బైట్‌డాన్స్ చైనాకు చెందినది. అమెరికాలో టిక్ టాక్170 మిలియన్లకు పైగా వినియోగదారులను కలిగి ఉంది. ఈ యాప్ వినియోగదారుల డేటాను చైనా ప్రభుత్వంతో పంచుకోవచ్చని అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. దీనిని జాతీయ భద్రతకు ముప్పుగా పేర్కొంటూ దేశంలో దాని కార్యకలాపాలను నిలిపివేసేందుకు ఓ చట్టాన్ని ఆమోదించింది. అయితే టిక్ టాక్ యూఎస్ లో పని చేస్తున్నా దానిపై పలుమార్లు అమెరికా గడువు పొడిగించింది.






