- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Operation Trashi: ఎన్‌కౌంటర్‌లో మరో ముగ్గురు తీవ్రవాదులు హతం
ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత ప్రభుత్వం ఉగ్రవాదులను అంతం చేయడానికి ఆర్మీ తో పాటు ఇతర బలగాలకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) తర్వాత భారత ప్రభుత్వం ఉగ్రవాదులను అంతం చేయడానికి ఆర్మీ (Army) తో పాటు ఇతర బలగాలకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంతో ఉగ్రవాదానికి అడ్డాగా మారుతున్న జమ్మూ కాశ్మీర్ (Jammu and Kashmir)లో ప్రత్యేక ఆపరేషన్ చేపడతూ.. పోలీసులు, బలగాలు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. దీనికి ."ఆపరేషన్ ట్రాషి" (Operation Trashi) పేరు పెట్టారు. అయితే ఈ రోజు ఉదయం.. ఓ ఇంట్లో నలుగురు ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే పక్కా సమాచారంతో.. ఆ ఇంటిని చుట్టు ముట్టారు. దాదాపు 4 గంటల పాటు సాగిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్లు (Three terrorists killed) అధికారులు స్పస్టం చేశారు. ఈ ఎన్ కౌంటర్ జమ్మూ కాశ్మీర్‌లోని కిష్ట్వార్ జిల్లాలోని సింగ్‌పోరా (చత్రూ) ప్రాంతంలో జరిగింది. ఈ ఆపరేషన్‌లో భారత సైన్యం (Indian Army), జమ్మూ కాశ్మీర్ పోలీసులు, CRPF సంయుక్తంగా పాల్గొన్నాయి.ఈ ఎన్ కౌంటర్ లో హతమైన వారు లష్కర్-ఎ-తొయిబా (LeT), జైష్-ఎ-మొహమ్మద్ (JeM) సంస్థలతో సంబంధం కలిగి ఉన్నట్లు భావిస్తున్నారు. ఎన్‌కౌంటర్ స్థలం నుండి భద్రతా దళాలు ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాయి.






